ఆవు దూడ ని చంపినందుకు పదేళ్ల జైలు శిక్ష

మనుషులను చంపితే చట్టం ముందు దోషిగా రుజువైతే వారికి నేరం తీవ్రతను బట్టి పదేళ్ల నుంచి యావజ్జీవం కారాగార శిక్ష, అలాగే ఉరి శిక్ష కూడా విదిస్తూ ఉంటారు.అయితే మనుషులను చంపడంతో పాటు జంతువులను చంపిన కూడా నేరమనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

 Gujarat Man Gets 10 Year Jail Term For Cow Slaughter Ona Lac Rupees-TeluguStop.com

తాజాగా గుజరాత్ కి చెందిన ఓ వ్యక్తికి స్థానిక జిల్లా కోర్టు వివో ఆవుదూడను చంపినందుకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధించింది.ఇప్పుడు ఈ కోర్టు విధించిన శిక్ష కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

గుజరాత్ లో యానిమల్ చట్టం ప్రకారం ఈ జైలు శిక్ష విధించినట్లు జడ్జి స్పష్టం చేశారు.రాజ్ కోట్ సమీప ప్రాంతానికి చెందిన సలీం అనే వ్యక్తిపై దూడను చంపాదంటూ గతంలో ఎఫ్ఐఆర్ నమోదైంది.

సలీం తన దూడను అపహరించి హతమార్చాడని సత్తార్ అనే వ్యక్తి ఈ కేసు నమోదు పెట్టాడు.సలీం నేరం చేసినట్టు రుజువు కావడంతో దీనిపై విచారణ చేపట్టిన రాజ్ కోట్ జిల్లా కోర్టు అతనికి పదేళ్ల జైలు శిక్ష లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.

ఇప్పుడు ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఆవులను అక్రమంగా తరలిస్తూ మాంసంగా మార్చేస్తున్న వారికి కూడా ఇలాంటి తరహా శిక్షలు విధించాలని డిమాండ్ తెరపైకి వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube