పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం ఆ కోణంలోనే ఉండబోతుందా

ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి జనసేన పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్.2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగేట్రం చేసిన కొన్ని అనివార్య కారణాల వల్ల పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడ్డాడు.

అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన ఒక్క పొరపాటు తాజా ఎన్నికల్లో జనసేన పార్టీని కేవలం ఒక్క స్థానానికి పరిమితం చేసింది.2014లో తెలుగుదేశం పార్టీకి జనసేన మద్దతు ఇవ్వడం చాలామంది రాజకీయ విశ్లేషకులు వ్యతిరేకించారు.అయినా అప్పటి పరిస్థితుల కారణంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకొని బిజెపి టిడిపి కూటమికి మద్దతుగా నిలబడ్డారు.

ఇక ఆ ప్రభావం 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నీ ఓటమికి ప్రధాన కారణం అయింది అని చెప్పాలి.జగన్ నేతృత్వంలోని వైసిపి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడానికి కేవలం ఆ ఒక్క అస్త్రాన్నే ఉపయోగించుకొని ప్రజలను బలంగా వినిపించింది.

ఇక విమర్శల పర్వం జనసేన మీద ఏ స్థాయిలో పని చేసాయో అందరికీ తెలిసిందే.ఇదిలా ఉంటే ఇప్పుడు ఐదేళ్ల తర్వాత రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కచ్చితంగా ప్రభావం చూపిస్తాడు అనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే పవన్ కళ్యాణ్ అలాంటి ప్రభావం చూపించాలంటే ఇప్పటి నుంచే సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టడంతో పాటు ఏదో ఒక కీలక అంశాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్లి ఉద్యమం చేయాలని, అలా చేస్తే పవన్ కళ్యాణ్ పై ప్రజల దృష్టి పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే జనసేన ప్రజల మధ్యకు బలంగా వెళ్ళాలంటే ప్రత్యేక హోదా కంటే బలమైన అంశం తెరపైకి తీసుకురావాలని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు

తాజా వార్తలు