గూగుల్ క్రోమ్ యూజర్లు Incognito మోడ్ బ్రౌజర్‌తో కాస్త జాగ్రత్తగా వుండండి… ఎందుకంటే?

నేడు దాదాపు అందరూ గూగుల్ క్రోమ్ బ్రోజర్లనే వాడటం జరుగుతోంది.దాంతో సైబర్ కేటుగాళ్లు క్రోమ్ వేదికగా అనేక మోసాలకు పాల్పడుతున్నారు.

 Google Chrome Incognito Tabs Get Biometric Authentication-TeluguStop.com

ముఖ్యంగా యూజర్ల డేటా చోరీకి సంబంధించి వివిధ భద్రతా పరమైన సమస్యలు జరుగుతున్నాయి.దాంతో అన్ని టెక్ కంపెనీలకు ఆన్‌లైన్ రిస్క్‌లను ప్రొటెక్ట్ చేసేందుకు సరికొత్త విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి.

క్రాస్-ప్లాట్‌ఫారమ్ వెబ్ బ్రౌజర్ క్రోమ్‌ను డెవలప్ చేసిన తమ యూజర్లకు సురక్షితమైన ఆన్‌లైన్ అనుభవాన్ని అందించనుంది.ఈ క్రమంలో మరోవైపు గూగుల్ యూజర్ల ప్రైవసీ సెట్టింగ్‌లు, సెక్యూరిటీ ఫీచర్లపై నిరంతరం పని చేస్తోంది.

‘privacy by design’ విధానాన్ని దృష్టిలో ఉంచుకుని Google ఇటీవల Chromeలో Incognito మోడ్ కోసం కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేసిందని మీకు తెలుసా? అవును, ఇపుడు యూజర్లకు మరింత ప్రైవసీ, సెక్యూరిటీని అందిస్తుంది.డేటా ప్రైవసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని Google ఇటీవలి బ్లాగ్ పోస్ట్‌లో Android యూజర్ల కోసం Chrome Incognito ట్యాబ్ కోసం బయోమెట్రిక్ లాక్‌ని యాడ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.

Telugu Biometric, Chromeincognito, Google, Google Chrome, Mode, Latest, Ups-Late

ఈ ఫీచర్ గత ఏడాది నుండి డెవలప్ స్టేజీలో ఉండగా నేటికి అది పూర్తయింది.గూగుల్ క్రోమ్ (Chrome)లో Incognito ట్యాబ్‌ల కోసం కొత్త ఫింగర్ ఫ్రింట్ లాక్ ప్రైవేట్ బ్రౌజింగ్ కోసం అదనపు సెక్యూరిటీని యాడ్ చేస్తోంది.దీనికోసం వినియోగదారులు తమ ఫింగర్ ఫ్రింట్ వాడాల్సి ఉంటుంది ఉంటుంది.సమస్య వచ్చినపుడు Incognito సెషన్‌ను మీరు రీస్టోర్ చేసినప్పుడు మీ బయోమెట్రిక్ అథెంటికేషన్ అవసరం రావచ్చు.

Telugu Biometric, Chromeincognito, Google, Google Chrome, Mode, Latest, Ups-Late

iOSలోని Chrome యూజర్ల అందరికి ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉండగా ప్రస్తుతం Android యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులో వచ్చిందని Google బ్లాగ్ పోస్ట్‌లో తాజాగా పేర్కొంది.ముందుగా చెప్పినట్లుగా.Incognito ట్యాబ్‌ల ఫీచర్ కోసం ఫింగర్‌ఫ్రింట్ లాక్ ఇప్పుడు iOS, Android రెండింటికీ అందుబాటులో ఉంది.ఆండ్రాయిడ్‌లో ఈ ఫీచర్‌ని పొందాలంటే.క్రోమ్ అప్‌డేట్ చేసిన వెర్షన్‌ని ఉపయోగించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube