గుడ్‌న్యూస్: నేటి నుంచి తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎంతంటే..?

భారతీయులు రవాణా కోసం ఎక్కువగా పెట్రోలు, డీజిల్‌పై ఆధారపడతారు.ఇక వంటల విషయానికి వస్తే గ్యాస్( Gas ) మీద ఆధారపడతారు.ఈ రెండింటి ధరలు తగ్గాలని ఎప్పుడూ ఆశిస్తూనే ఉంటారు.సాధారణంగా గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.చమురు ధరలు పెరిగితే, సిలిండర్ ధరలు కూడా పెరుగుతాయి.చమురు ధరలు తగ్గితే, సిలిండర్ ధరలు కూడా తగ్గుతాయి.

 Good News How Much The Gas Cylinder Prices Have Reduced From Today, Gas Cylinder-TeluguStop.com

మామూలుగా ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను ( Gas cylinder prices ) సవరిస్తారు.అయితే, కొన్నిసార్లు అంతర్జాతీయ చమురు మార్కెట్లో హఠాత్తుగా మార్పులు చోటుచేసుకుంటే, నెల మధ్యలో కూడా ధరలను సవరించే అవకాశం ఉంది.

Telugu April, Gas Cylinder, Gas Rates, Gascylinder, Latest, Lpg Gas, Telugu-Late

ఈరోజు ఏప్రిల్ ఒకటి కావున గ్యాస్ సిలిండర్ ధరలను ఎప్పటిలాగానే సవరించారు.ఆయిల్ కంపెనీలు ఈనెల గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తూ వినియోగదారులకి శుభవార్త అందించారు.19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.30.50 తగ్గిస్తూ వ్యాపారులకు కొంతమేర ధరల భారాన్ని తగ్గించారు.ఈ తగ్గుదల తర్వాత దీని ధర రూ.1,764.50కి దిగి వచ్చింది.దీనితోపాటు 5 కేజీల FTL సిలిండర్ ప్రైస్( 5 kg FTL cylinder price ) కూడా తగ్గించారు.రూ.7.50 తగ్గించి దీనిని మరింత సరసమైన ధరకు తీసుకొచ్చారు.కొత్త ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి అని వినియోగదారులు గమనించాలి.

Telugu April, Gas Cylinder, Gas Rates, Gascylinder, Latest, Lpg Gas, Telugu-Late

ఇదిలా ఉండగా గృహ అవసరాల కోసం వాడే సిలిండర్ ధరలను తగ్గించలేదు, అలాగని పెంచనూ లేదు.దీనివల్ల ఈ నెల ప్రజలపై ఎక్కువగా ఎలాంటి ప్రభావం పడదని చెప్పుకోవచ్చు.మరి నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.హైదరాబాద్ 14.2 కిలోల LPG గ్యాస్ సిలిండర్ ధర రూ.966, వరంగల్‌లో రూ.974, విశాఖపట్నంలో రూ.912, విజయవాడలో రూ.927, గుంటూరులో రూ.944గా ఉన్నాయి.రాష్ట్రాల వారీగా సిలిండర్ ధరలు కొద్దిగా మారుతూ ఉంటాయి.

దీనికి కారణం రాష్ట్రాల వారీగా పన్నులు భిన్నంగా ఉండటం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube