రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రమాదాల నివారణకు పెట్రో కార్ ,కానిస్టేబుల్ కటౌట్లను కోదురుపాక వద్ద ఏర్పాటు చేసినట్లు ఎస్సై పృథ్వీధర్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ బోయినపల్లి మండలం పరిధిలోని కొదురుపాక చౌరస్తా ను బ్లాక్ స్పాట్ గా గుర్తించి ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నందున చౌరస్తాలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం, పక్కన ఒక కానిస్టేబుల్ నిలబడిన ఫోటోను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు కొదురుపాక చౌరస్తా వద్ద పెట్రో కర్ కానిస్టేబుల్ ఫొటో ఉన్న కటౌటు ఏర్పాటు చసినట్లు ఎస్ ఐ పృథ్వీధర్ గౌడ్ తెలిపారు .
వాహనదారుల యొక్క హెడ్లైట్ పడగానే రేడియం తో మెరిసి వాహనదారులు నెమ్మదిగా వెళ్లడం వలన ఏలాంటి ప్రమాదాలు జరగవనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్లు ఎస్ ఐ తెలిపారు.ఈ కార్యక్రమంలో వేములవాడ ట్రాఫిక్ ఎస్ఐ , సిబ్బంది పాల్గొన్నారు.