ఉపమాలంకారం గురించి ఈ చిన్నోడి రాసిన ఆన్సర్ చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే..!?

సోషల్ మీడియాలో ఫన్నీ ఫొటోలు, వీడియోలకు కొదవలేదు.వీటిలో పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకు అనేకమంది చేసిన చిలిపి చేష్టలకు సంబంధించిన కంటెంట్ ఉంటుంది.

 Student Funny Answer Sheet Viral Details, Kids Talent, Viral Latest, Viral News,-TeluguStop.com

ఇక విద్యార్థుల ఫన్నీ ఫోటోలు, వీడియోలు కూడా చాలామందిని ఆకర్షిస్తాయి.మామూలుగా పిల్లలకు ఎగ్జామ్స్ అంటే చాలా భయం వేస్తుంది.

ఫెయిల్ అయిపోతామేమోనని టీచర్లు( Teacher ) పనిష్ చేస్తారేమో అని ఆందోళన ఉంటుంది.

కనీసం పాస్ మార్కులు అయినా తెచ్చుకోవాలని చాలామంది పుస్తకం ముందు పెట్టుకుని చదువుతారు.

కొంతమంది మాత్రం చీట్ చేసి ఎగ్జామ్‌ పాస్ అవ్వాలని అనుకుంటారు.ఇక ఇంకొందరు ఆన్సర్ పేపర్లు( Answer Papers ) నింపితే చాలు పాస్ మార్కులు వచ్చేస్తాయని కథలు, కవిత్వాలు రాసేస్తుంటారు.

తాజాగా ఒక విద్యార్థి( Student ) కూడా ఇలాంటి పని చేశాడు.అతడు ఒక ప్రశ్నకు రాసిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Telugu Sheet, Netizens, Teacher, Teacher Shocked, Telugu Exam, Upamalankaram, Up

ఆ స్టూడెంట్ ఎగ్జామ్ పేపర్‌లో అతి తెలివిగా రాసిన ఆన్సర్ చూసి సోషల్ మీడియా యూజర్లు పొట్టనొప్పి వచ్చేంతలా నవ్వుకుంటున్నారు.ఈ పిల్లోడు ఇటీవల ఒక తెలుగు పరీక్షకు హాజరయ్యాడు.ఆ తెలుగు క్వశ్చన్ పేపర్‌లో ఉపమాలంకారం( Upamalankaram ) గురించి రాయమని అడిగారు.అయితే అదేంటో తెలియని సదరు స్టూడెంట్ ఉప్మా తయారీ విధానం గురించి రాశాడు.

ఉపమాలంకారానికి, ఉప్మాకి మధ్య అసలు ఎలాంటి సంబంధం ఉండదు.ఉపమాలంకారం తయారీ విధానం గురించి ఆన్సర్ పేపర్లో ఉంటుందని టీచర్ అసలు ఊహించలేదు.

అందుకే ఆ సమాధానం చూసి బిత్తరపోయాడు.సదరు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఉప్మా ఎలా తయారు చేయాలో చక్కగా వివరించి, దాని టేస్ట్ కూడా ఎలా ఉంటుందో తెలిపాడు.

Telugu Sheet, Netizens, Teacher, Teacher Shocked, Telugu Exam, Upamalankaram, Up

అయితే ఈ విద్యార్థి రాసిన ఆ ఆన్సర్‌ను అడ్డంగా కొట్టేశాడు టీచర్.చదువుకోకుండా ఇలాంటి ఉపయోగం లేని సమాధానాలు రాయొద్దని కూడా హెచ్చరించాడు.అయితే సోషల్ మీడియాలో ఈ ఆన్సర్ షీట్ చూసి చాలా మంది నవ్వుకున్నారు.అసలైన జాతిరత్నం అంటే ఈ స్టూడెంట్‌యే అని చాలామంది కామెంట్ చేశారు.పెద్దయ్యాక పెద్ద వంట గాడు అవుతాడేమో అని మరికొందరు ఫన్నీగా వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube