యాదగిరిగుట్ట భక్తులకు గుడ్ న్యూస్...!

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఉన్నతాధికారులు శుక్రవారం భక్తులకు శుభవార్త అందించారు.ఇకపై స్వామి వారి దర్శనంతో పాటు ఆర్జిత సేవలు ఆన్‌లైన్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.

 Good News For Yadagirigutta Devotees, Good News , Yadagirigutta Devotees, Yadadr-TeluguStop.com

స్వామి వారిని దర్శించుకొనేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు యాదాద్రికి తరలి వస్తున్నారని,ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులు పేర్కొన్నారు.ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం తీసుకువచ్చిన సౌకర్యాలన్నీ యాదాద్రిలో తీసుకువస్తామని స్పష్టం చేశారు.

అందులో భాగంగానే ఆన్‌లైన్ సేవలు తీసుకు వచ్చామని వివరించారు.ఆన్‌లైన్‌లో yadadritemple.

telangana.gov.in.వెబ్‌సైట్‌లోకి వెళ్లి టికెట్లు బుక్ చేసుకోవచ్చని భక్తులకు సూచించారు.ఇక ఇదే వెబ్‌సైట్ నుంచి ఈ హుండీకి విరాళాలు కూడా ఇవ్వ వచ్చునని భక్తులకు తెలిపారు.

ఆన్‌లైన్ ద్వారా గంట ముందు స్వామి వారి దర్శనం,పూజ కైంకర్యాలకు బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అత్యంత మహిమాన్విత పుణ్య క్షేత్రాలు చాలానే ఉన్నాయని, వాటిలో యాదాద్రి ఒకటి.

యాదగిరిగుట్టలో కొలువు తీరిన శ్రీలక్ష్మీనరసింహస్వామి భక్తుల కోరిన కోరికలు తీరుస్తాడని ప్రజలు బలంగా నమ్ముతారు.మరోవైపు ఆ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు.ఆ క్రమంలో యాదగిరిగట్టు కాస్తా యాదాద్రిగా మారింది.తిరుమల తరహాలోనే యాదాద్రిలో ఆలయ నిర్మాణం చేపట్టారు.

దీంతో మాఢ వీధులు,స్వామి వారి పూజా కైంకర్యాలు,ఆర్జిత సేవలు,వీఐపీ దర్శనాలు, ప్రసాదాలతో యాదాద్రి తెలంగాణ తిరుమలగా రూపుదిద్దుకొంది.ఇంకోవైపు వీఐపీ, వీవీఐపీలు,సిఫార్సులపై వచ్చే భక్తులకు రూ.300 టికెట్‌ ద్వారా బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు.రూ.150 చెల్లించి శీఘ్ర దర్శనం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంది.కానీ,అన్ని సేవలను ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు యాదాద్రి దేవస్థానం ఉన్నతాధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube