భారతీయులకు శుభవార్త..ఇప్పటి నుంచి ఇన్ని రోజులకే వీసా పాస్ పోర్ట్..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని భారత ప్రవాసులకు నిజంగా ఇది శుభవార్త అని చెప్పవచ్చు.ప్రజలకు వారంలోని ఏడు రోజులు కూడా వీసా పాస్ పోర్ట్ సర్వీస్ లు అందుబాటులోకి వస్తున్నాయి.

 Good News For Indians..visa Passport In Just A Few Days From Now , Indians , Vis-TeluguStop.com

ఆదివారాలు కూడా ఇకపై సంబంధిత కార్యాలయాలు తెరిచి ఉంటాయని వారంలోని మిగతా రోజుల్లో మాదిరిగానే ఇక్కడ దరఖాస్తుల స్వీకరణ ప్రాసెస్ ఉంటుందని వెల్లడించారు.దీనిలో భాగంగా పాస్ పోర్ట్, వీసా సంబంధిత సేవల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి ఇండియన్ అవుట్ సోర్సింగ్ సర్వీస్ ప్రొవైడర్ బి ఎల్ ఎస్ ఇంటర్నేషనల్ సర్వీస్ లిమిటెడ్ కేంద్రాలు ఆదివారంతో సహా వారానికి ఏడు రోజులు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

Telugu Bls Centers, Dr Aman Puri, Dubai, Indianconsul, Indians, International, P

భారత 74 వ గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి మాట్లాడుతూ మీ శ్రేయస్సు సమక్షం కోసం పనిచేయడానికి మా నిబద్ధతను నేను పునరుద్ఘాటిస్తున్నాను.ఈ క్రమంలో గత వారం నుంచి పాస్ పోర్ట్, వీసా సేవల కోసం అవుట్ సోర్స్ సర్వీస్ ప్రొవైడర్ వారంలోని అన్ని రోజులు పనిచేస్తుందని వెల్లడించారు.అలాగే ఇప్పటినుంచి ఓపెన్ డోర్ విధానాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు.దీని ద్వారా భారతీయ ప్రవాసులు అపాయింట్మెంట్ లేదా ముందస్తు నోటిఫికేషన్ లేకుండా ఏదైనా విషయానికి సంబంధించి తమ ఫిర్యాదును నమోదు చేసుకోవడానికి కాన్సులేట్‌ను సందర్శించవచ్చని వెల్లడించారు.

Telugu Bls Centers, Dr Aman Puri, Dubai, Indianconsul, Indians, International, P

భారతీయ ప్రవాసుల డిమాండ్ ను తీర్చడానికి జనవరి 22 నుంచి అన్ని రోజుల్లో పాస్ పోర్ట్, వీసా సేవల కోసం దరఖాస్తు చేసుకోవడానికి దుబాయ్, షార్జా లో ఉన్న మూడు కేంద్రాలను తెరవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.అయితే ఆదివారాల్లో దరఖాస్తుదారులు అత్యవసర కేసులు మినహా అపాయింట్మెంట్ ప్రతిపాదికన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తును అవసరమైన సహాయక పత్రాలతో పాటు అందించాలని వెల్లడించారు.దీనికోసం దరఖాస్తుదారులుhttps://blsindiavisa-uae.com/appointmentbls/appointment.php ఈ లింకును ఉపయోగించి బిఎల్ఎస్ కేంద్రాలతో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube