క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. మల్టీప్లెక్స్‌ల్లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు..

ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.ఈ రసవత్తరమైన మ్యాచ్‌లు చూసేందుకు క్రికెట్ అభిమానులు సిద్ధమవుతున్నారు.

 Good News For Cricket Fans World Cup Matches In Multiplexes..,inox, Multiplex, T-TeluguStop.com

అయితే ఈ మ్యాచ్‌లను మల్టీప్లెక్స్ థియేటర్లలో చూస్తే వచ్చే మజానే వేరు.గతంలో కూడా థియేటర్లలో లైవ్ మ్యాచ్ లను ప్రసారం చేశారు.

ఇప్పుడు కూడా ఐనాక్స్ సంస్థ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు సమాయత్తమవుతోంది. క్రికెట్​ మ్యాచ్​లను మొబైల్​, టీవీ స్క్రీన్లపై కాకుండా వెండితెరపై చూసే చక్కటి అవకాశాన్ని ఇది అందజేస్తోంది.

ఈ విషయమై ఈ సంస్థ ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేసింది.తమ ఐనాక్స్ మల్టీప్లెక్స్‌ల్లో టీమ్​ ఇండియా ఆడే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్​లను లైవ్​ టెలికాస్ట్ చేస్తామని వెల్లడించింది.

ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో ఒక డీల్ కూడా కుదుర్చుకున్నట్టు తెలిపింది.అయితే క్రికెట్ అభిమానులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు కేవలం 25 నగరాలలో ఉన్న ఐనాక్స్ మల్టీప్లెక్స్​లలో మాత్రమే టెలికాస్ట్ కానున్నాయి.ఏయే నగరాలనే విషయం ఐనాక్స్ అధికారిక ప్రకటనలో తెలుసుకోవచ్చు.

అక్టోబర్​ 23న పాకిస్థాన్​తో టీమ్ ఇండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది.పాక్, భారత్ మధ్య జరిగే మ్యాచ్ ఇరుదేశాల అభిమానులలో ఎంతో ఉత్కంఠ రేపుతోంది.ఇలాంటి మ్యాచ్ తోనే మల్టీప్లెక్స్ లైవ్​ స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తామని ఐనాక్స్ సంస్థ పేర్కొంది.ఐనాక్స్ సీఓఓ ఆనంద్ విశాల్​ మాట్లాడుతూ.“ఇండియాలో అత్యధిక మంది క్రికెట్​ను ఎంతగానో ఆదరిస్తూ ఉంటారు.అలాంటి వారికి బిగ్ స్క్రీన్​ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేయడానికి మేం రెడీ అయ్యాం.

ఈ క్రికెట్ మ్యాచ్‌లను బెస్ట్ సౌండ్​ ఎఫెక్ట్​తో ప్రసారం చేస్తాం.ఫ్యాన్స్‌కి ఒక వర్చువల్​ ట్రీట్​ అవుతుందని ఆశిస్తున్నాం” అని అన్నారు.

INOX To Screen T20 World Cup 2022 Matches

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube