ఆ నదిలో బంగారమే బంగారం.. ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

సాధారణంగా నదిలో వెతికితే అరుదైన రాళ్లు, రప్పలు దొరుకుతాయి.అలాగే ప్రవాహంలో కొట్టుకొచ్చిన అనేక గృహ వస్తువులు, చెప్పులు, బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు, ఇంకా అందులో నివసించే చేపలు కనిపిస్తాయి.

 Gold ,river, Latest News, Viral Latest, News Viral, Social Media,maleshiya-TeluguStop.com

కానీ థాయ్‌లాండ్‌లోని ఓ నదిలో దిగి వెతికితే బంగారం దొరుకుతుందట.అక్కడి స్థానిక ప్రజలు అందరూ ఈ నదిలోకి దిగి బంగారం దొరకబుచ్చుకుంటున్నారు.వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.ఇదంతా వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నిజమే! మరి ఈ బంగారు నది గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా.!

దక్షిణ థాయ్‌లాండ్‌లోని ఫు కవో థాంగ్‌ అనే ప్రాంతం మలేషియాతో సరిహద్దును పంచుకుంటుంది.ఇక్కడ అధికంగా బంగారు గనులు ఉంటాయి.

ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో బంగారాన్ని తవ్వి వెలికి తీస్తున్నారు.అయితే ఆ ప్రాంతం వైపు నుంచే ఒక నది ప్రవహిస్తుంటుంది.

తవ్వకాల్లో బయట పడే బంగారంలో కొంతమేర నదిలో పడి కొట్టుకొస్తుంటుంది.అందుకే దీన్ని గోల్డ్‌ రివర్‌ అని పిలుస్తుంటారు.

కోవిడ్ 19 కారణంగా కొద్ది నెలలుగా మైనింగ్‌ జరగడం లేదు.దాంతో అక్కడి కార్మికులు ఉపాధి కోల్పోయి దీనావస్థ పరిస్థితిలో జీవనం సాగిస్తున్నారు.

మిగతా పనులు చేసేవారు కూడా ఉపాధి కోల్పోయి నానా యాతన పడుతున్నారు.ఈ క్రమంలోనే ఖాళీగా ఉండటం కంటే ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలని అక్కడి గ్రామస్తులు నిశ్చయించుకున్నారు.

అప్పుడే వారు గోల్డ్‌ రివర్‌ను జల్లెడ పట్టడం స్టార్ట్ చేశారు.

Telugu Gold, Latest, River-Latest News - Telugu

ఫు కవో థాంగ్‌ ప్రాంతంలోని బంగారు గనుల్లో తవ్వకాలు జరుపుతున్నప్పుడు చిన్నపాటి బంగారు ముక్కలు, రేణువులు ఎగిరి ఈ నదిలో పడతాయి.అలా పడిన బంగారం రేణువులు ప్రవాహంలో కొట్టుకొచ్చే అవకాశాలు ఎక్కువ.కాస్తోకూస్తో నదిలో పడే బంగారం చివరికి మట్టిలో కలిసిపోతుంది.

అందుకే అక్కడి ప్రజలు నది అడుగు భాగాన ఉండే మట్టిని సేకరించి అందులో బంగారు రేణువులను జల్లెడపట్టి వెలికి తీస్తుంటారు.చాలా గంటలపాటు కష్టపడి వెతికితే.రోజువారీ కూలి చేసినంత డబ్బు లభిస్తుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.నదిలో దొరికిన బంగారమే తమకు జీవనాధారం అయిందని తెలుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube