Success Story : స్వీపర్ నుండి ఎంటమాలజిస్ట్ గా ఎదిగిన మహిళ..!

పరిస్థితులు అన్ని నేర్పిస్తాయని పెద్దలు ఊరికే అనలేదు.ఆ మహిళ కూడా అందుకు అతీతం కాదు.

 Ghmc Sweeper Offered Job Of Assistant Entomologist-TeluguStop.com

కుటుంబం కోసం ఆమె చదువును కూడా లెక్కచేయకుండా పీజీ చదివిన ఆమె రోడ్లు ఊడ్చేందుకు కూడా వెనుకాడ లేదు.కుటుంబ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ఆమె స్వీపర్ గా చేయక తప్పలేదు.

అత్తమామలను, భర్తను తన పిల్లలను కాపాడుకునేందుకు ఆమె చీపురు పట్టక తప్పలేదు.

ముందు ఆమె ఆర్ధిక కష్టాలను తీర్చుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేసిన అవి ఏవి కుటుంబం గడవడానికి పెద్దగా ఉపయోగపడలేదు.

మధ్యలో కరోనా రావడంతో ఇంకా ఆర్ధిక అవసరాలు పెరిగిపోయాయి.దీంతో ఆమె స్వీపర్ అవతారం ఎత్తింది.అయితే అక్కడ కూడా ఆమె పట్టుదల, శ్రమ ఆమెను ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లాయి.ఇప్పుడు ఈమె సక్సెస్ ఫుల్ స్టోరీ ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది.

ఆమె పేరు రజని.ఆమె వరంగల్లో నివసిస్తుంది.ఆమె చిన్నప్పటి నుండి చదువులో ముందుంటు భవిష్యత్తు మీద ఎన్నో కళలు కన్నది.కానీ తల్లిదండ్రులు పెళ్లి చేయడంతో ఆ కళలు అక్కడితో ఆగిపోయాయి.

ఆమె పీజీ చేసి పిహెచ్డి కోసం అర్హత సాధించిన సమయంలోనే ఒక లాయర్ తో పెళ్లి కావడంతో చదువుకు ఫుల్స్టాప్ పెట్టింది.పెళ్లి జరిగి పది సంవత్సరాలు అయ్యి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు.

ఆమె భర్తకు ఇప్పటికే మూడు సార్లు హార్ట్ ఎటాక్ రావడం పనిచేయలేని పరిస్థితి రావడంతో ఆర్ధికంగా కృంగిపోయారు.కిరానా షాప్ పెట్టుకుని గడుపుతున్న అవి సరిపోవడం లేదు.

అందుకే ఆమె కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకుంది.కరోనా కారణంగా ఇతర ఉద్యోగాలు కూడా రాకపోవడంతో ఆమె ఇక చీపురు పట్టాలని నిర్ణయించుకుంది జిహెచ్ఎంసి లో జాయిన్ అయ్యింది.

కుటుంబ సభ్యులు వద్దన్నా ఆమెకు మరో ఆప్షన్ లేకపోవడంతో చీపురు పట్టక తప్పలేదు.అక్కడ కూడా ఆమె శ్రమించి పట్టుదలతో తన పనిని చేసుకుంటూ వచ్చింది.స్వీపర్ నుండి ఎంటమాలజిస్టు గా నియమించారు.అయితే ఈమెపై మీడియాలో ఆమెపై వరుస కథనాలు రావడంతో ఏకంగా కేటీఆర్ కూడా స్పందించారు.ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని గ్రేటర్ మున్సిపాలిటీ కమిషనర్ ఆదేశించారు.దీంతో ఈమెకు అధికారులు అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ గా ఉద్యోగం ఇచ్చారు.

దీంతో రజని కేటీఆర్ కు, మున్సిపాలిటీ కమిషనర్ కి ధన్యవాదాలు తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube