తాజాగా ప్రముఖ రాజకీయ వేత్త, మాజీ కేంద్ర మంత్రి, గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో రాజకీయ నాయకులు మెగాస్టార్ చిరంజీవి,పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.అయితే ఈ అలయ్ బలయ్ వేడుకలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ తాను సినీ పరిశ్రమలో ఎదుగుతున్న రోజులలో ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి అగ్రనటులు కలివిడిగా ఉండేవారని తెలిపారు చిరంజీవి.
కానీ వారి అభిమానులు మాత్రం ఒక హీరో పోస్టర్ పై మరొకరు అశుద్ధం చల్లుకునే వారు.ఆ పరిస్థితిని మార్చాలని తాను కూడా ఎంతో ప్రయత్నించినట్లు చిరంజీవి వెల్లడించారు.
ఆ తరువాత గరికపాటి నర్సింహరావు గురించి మాట్లాడుతూ.అయ్యా నేను మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను.
మిమ్మల్ని, ఈ ప్రవచనాలలో నేను ఎంతగానో ఇష్టపడతాను.ఇందులో మీరు చెప్పే కొన్ని వాక్యాలు ఇన్స్పిరేషన్ గా కూడా తీసుకుంటాను అని చెప్పి గరికపాటి దగ్గరికి వెళ్లి శిరస్సు వంచి మరి చిరంజీవి నమస్కారం చేశారు.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ చిరంజీవి ప్రసంగం ముగిసిన తర్వాత ఇంతలోనే మహిళా అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున వచ్చి చిరంజీవితో ఫోటోలు తీసుకుంటున్నారు.అప్పుడు చిరంజీవి వారితో కలిసి ఫోటోలు దిగుతుండగా కోపంతో రగిలిపోయిన గరికపాటి నర్సింహరావు అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఆగితే నేను మాట్లాడుతాను.
లేకపోతే వెళ్లిపోతాను.చిరంజీవి గారు దయచేసి ఫోటో సెషన్ ఆపేసి.పక్కకు రండి.నేను మాట్లాడుతాను.
చిరంజీవికి విన్నపం.ఫోటో సెషన్ ఆపి ఇక్కడికి రావాలి.
లేకపోతే నాకు సెలవు ఇప్పించండి అంటూ ఘాటుగా గరికపాటి ఫైర్ అయ్యాడు.అలాగే గరికపాటి నరసింహారావు సందర్భంలో మాట్లాడుతూ.
నేను నందమూరి తారక రావు అభిమానిని.నందమూరి అభిమాన సంఘానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నాను.
ఆ సమయంలో మాకు ప్రధాన శత్రువు అక్కినేని నాగేశ్వరరావు.ఇక ఆయన సినిమాలపై మేము పేడ కొట్టే వాళ్ళం అంటూ చిరంజీవి గరికపాటి విషయంలో అక్కినేని ఫ్యామిలీని లాగారు గరికపాటి.
ఈ విషయం పై స్పందించిన పలువురు అభిమానులు మధ్యలోకి అక్కినేని ఫ్యామిలీని లాగారు.అయితే చిరంజీవి విషయంలో గరికపాటి ఆ విధంగా మాట్లాడడం పై నెటిజన్స్ తప్పులు పడుతూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవి ఇచ్చిన మర్యాదను పట్టించుకోకుండా అలా మాట్లాడడం సరికాదు అంటూ అతనిపై ట్రోలింగ్ చేస్తున్నారు.