బీజేపీలోకి గంటా ? చక్రం తిప్పిన మెగాస్టార్ ?

పార్టీ మారిపోతున్నాడు, మారిపోతున్నాడు అంటూ విశాఖ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై వస్తున్న గాసిప్స్ ఇప్పటివి కాదు.ఆయన పార్టీ మార్పుపై వార్తా కథనాలు వస్తూనే ఉన్నాయి.

 Tdp Mla Ganta Srinivasarao Try To Join In Bjp, Ganta Srinivas Rao, Megastar Ch-TeluguStop.com

దీనికి తగ్గట్టుగానే ఆయన వైసీపీలోకి వెళ్లేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు.కానీ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో, ఆయన చేరిక నిలిచిపోయింది.2019 ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేసిన తర్వాత అనేకసార్లు గంటా పార్టీలోకి వెళ్లేందుకు రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నాలు చేశారు.ఒక దశలో టిడిపికి వ్యతిరేకంగా అమరావతి వ్యవహారంపై గంటా మాట్లాడడంతో ఆయన పార్టీ మార్పు తప్పదని భావించారు.

ఆ తర్వాత టిడిపి పోరాడుతున్న అమరావతి నినాదం ఎత్తుకొని టిడిపికి మద్దతుగా మాట్లాడడంతో అంతా ఆశ్చర్యపోయారు.ఏదో ఒక రకంగా అధికార పార్టీ నాయకుడు అవ్వాాలనే తాపత్రయంతోనే గంటా ఉంటూ వస్తున్నారు.

కానీ కారణాలు ఏంటో తెలియదు కానీ, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, జగన్ గంటా ను చేర్చుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు.ఆయనను పార్టీలో చేర్చుకున్నా, తన సొంత ఎదుగుదల కోసమే పార్టీని ఉపయోగించుకుంటాడు అనే అభిప్రాయంతో జగన్ వెనక్కి తగ్గారు అనే వార్తలు వచ్చాయి.

తాజాగా ఆయన బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం బిజెపి అన్ని విషయాల్లోనూ దూకుడుగా వ్యవహరిస్తోందని, ఆ పార్టీకి భవిష్యత్తు ఉండడంతో పాటు, తనను రావాల్సిందిగా ఆహ్వానాలు పంపడం, వైసిపి పరోక్షంగా తన ఎంట్రీని ఇష్టపడకపోవడం వంటివి బిజెపి వైపు వెళ్లేందుకు కారణంగా తెలుస్తోంది.

దీనికి తగ్గట్టుగా సోము వీర్రాజు సైతం మెగాస్టార్ చిరంజీవి ద్వారా బీజేపీ లోకి వచ్చే విధంగా ఒప్పించినట్లు తెలుస్తోంది.

ప్రజారాజ్యం సమయం నుంచి చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా గంటా శ్రీనివాసరావు ముద్రపడ్డారు.

ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చిరంజీవి తో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు.దీంతో  గంటా బాధ్యతను కూడా అప్పగించడంతో, చిరు చక్రం తిప్పి గంటాను బీజేపీలోకి వెళ్లేందుకు ఒప్పించి మార్గం సుగమం చేసినట్లు సమాచారం.

మరికొద్ది రోజుల్లోనే గంటా బిజెపి తీర్థం పుచ్చుకోవడం ఖాయం అవ్వడంతో వైసిపి నాయకులు కూడా సంతోషంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.గంటా చేరితే తమకు ప్రాధాన్యం ఎక్కడ తగ్గుతుందో అన్న అభిప్రాయంలో ఉంటూ వచ్చారు.

ఈ విషయంలోనే ఇప్పటి వరకు ఆందోళన చెందిన వారంతా, ఈ పరిణామాలతో ఊపిరి పీల్చు కున్నట్టుగా కనిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube