మీరు ఎప్పుడైనా మీ పాఠశాలలో ఉపాధ్యాయుడితో కలిసి నృత్యం చేశారా? చాలా మంది దీనికి సమాధానం లేదు అనే చెబుతారు.ఎందుకంటే మునుపటి కాలంలో గురువులు చాలా క్రమశిక్షణ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేవారు.
ఏ మాత్రం అల్లరి చేసినా తోలు ఊడొచ్చేలా కొట్టేవారు.తమ పిల్లలను కూడా అల్లరి చేస్తే దండించాలని గురువులకు తల్లిదండ్రులు చెప్పే వారు.
కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది.ఇప్పుడు చిన్న పిల్లలను తిట్టినా గురువులపై తల్లిదండ్రులు విరుచుకుపడుతున్నారు.
ఒక దెబ్బ వేస్తే పోలీస్ కేసులు కూడా పెడుతున్నారు.మరో వైపు విద్యావ్యవస్థలోనూ పలు మార్పులు వచ్చాయి.
గురువులు స్నేహపూర్వకంగా మెలుగుతూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.ఆట పాటల ద్వారా బోధన సాగిస్తున్నారు.
ఇదే కోవలో ఓ టీచర్ తన స్టూడెంట్లతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అనుష్క చౌదరి అనే మహిళా టీచర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది.తరచూ తరగతి గదిలో తన స్టూడెంట్లతో కలిసి ఆమె చేస్తున్న డ్యాన్స్ వీడియోలకు సోషల్ మీడియాలో విశేష ఆదరణ లభిస్తోంది.తాజాగా ఆమె భోజ్ పురీ పాపులర్ పాట ‘కా కరిహే భయ్యా కా కరిహే’కు చిన్నారులతో కలిసి ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేసింది.
ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆమె పోస్ట్ చేసింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు టీచర్ డ్యాన్స్ ను ప్రశంసిస్తున్నారు.
తమ కాలంలో ఇటువంటి టీచర్లు లేరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఆ విద్యార్థులు చాలా అదృష్టవంతులను పేర్కొంటున్నారు.స్టూడెంట్లతో స్నేహ పూర్వకంగా టీచర్లు ఉండడం అద్భుతమని, ఆటపాటల ద్వారా చిన్నారులలో విద్య పట్ల ఆసక్తి రేకెత్తించడం అభినందనీయమని నెటిజన్లు అంటున్నారు.