సింధులోయ నాగరికులు అలా చేసేవారట!

సాధారణంగా ఏవైనా తవ్వకాలలో పురాతన వస్తువులు బయట పడటం సహజమే.ఇలాంటి తవ్వకాలలో సింధులోయ నాగరికతకు చెందిన వస్తువులు కొన్ని పురావస్తు శాఖ తవ్వకాల్లో బయట పడ్డాయి.

 Fatty Residues On Ancient Pottery Reveal Meat Heavy Diets Of Indus Civilization-TeluguStop.com

ఈ తవ్వకాలలో సింధూ లోయ నాగరికత గురించి పలు కీలక అంశాలు బయట పడుతున్నాయి.ఈ తవ్వకాలు ఆధారంగా వారి జీవన విధానం ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉన్నాయో పూర్తిగా అర్థం అవుతుంది.

సింధులోయ నాగరికతకు చెందిన వివిధ ప్రాంతాలలో దాదాపు అడుగు పొరల శిథిలాలో ఇప్పుడు ప్రాచీన సిరామిక్ మట్టికుండలు బయటపడుతున్నాయి.అయితే వీటిపై పురావస్తు శాఖ అధికారులు పరిశోధనలు జరుపుతున్నారు.

ఈ పరిశోధనలో భాగంగా కుండలపై కొవ్వు అవశేషాలు ఏర్పడి ఉన్నాయని పురావస్తు శాఖ అధికారులు తెలియజేశారు.వీటిని లోతుగా పరిశీలించిన అధికారులు సింధులోయ నాగరికతకు చెందిన ప్రజలు ఎక్కువగా మాంసం ఉత్పత్తులను ఆహార పదార్థాలుగా తీసుకునే వారని గుర్తించారు.

సింధులోయ నాగరికతకు చెందిన ప్రజలు ఎక్కువగా పాల ఉత్పత్తుల తయారీలో సింధు లోయ ప్రజలకు ఎవరు సాటిలేరు అని తెలిపారు.

సింధనాగరికత మూలాలు కలిగిన వాయువ్య భారతదేశంలో అప్పటి గ్రామీణ, పట్టణ నగరాల్లోనే ఈ మాంసపు కొవ్వుల అవశేషాలు బయటపడ్డాయనిప్రాన్స్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలోని ఆర్కియాలజీ విభాగంలో మాజీ పీహెచ్‌డీ విద్యార్థి, డాక్టర్ అక్షయతా సూర్యనారాయణన్ నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనాన్ని జర్నల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సైన్స్‌లో ప్రచురించబడింది.

అయితే ఈ తవ్వకాలలో బయటపడిన మట్టికుండలో పై పంది, గొర్రెలు, గేదెల మాంసం లో ఉండే కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు ఉన్నట్లుగా గుర్తించారు.

ఈ పరిశోధనలను బట్టి సింధులోయ నాగరికతకు చెందిన ప్రజలు ఎక్కువగా మాంసం ఉత్పత్తులను తినేవారని ఈ పరిశోధనలో తెలిపారు.

అంతేకాకుండా గతంలో జరిపిన ఎన్నో పరిశోధనలలో సింధు నాగరికులు పాల ఉత్పత్తులను వాడేవారని గుర్తించారు.గుజరాత్ లో జరిపిన తవ్వకాలలో డైరీ ప్రాజెక్టులకు సంబంధించిన గిన్నెల అవశేషాలు బయటపడ్డాయని ఈ సందర్భంగా పురావస్తు శాఖ అధికారులు సింధు నాగరికత గురించి తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube