టాలీవుడ్ లో చాలా కాలంగా వినిపిస్తున్న పేరు సువర్ణ సుందరి.గ్రాఫిక్స్ ప్రాధాన్యంగా, హిస్టరీ, ప్రెజెంట్ ని కలుపుతూ, హర్రర్, ఫాంటసీ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
సీనియర్ హీరోయిన్ జయప్రద కీలక పాత్రలో, పూర్ణ, సాక్షి చౌదరి హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కుతుంది.ఎంఎస్ఎన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది.
ఇదిలా వుంటే ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ కారణంగా ఇన్ని రోజులు ఆలస్యం అయినట్లు గతంలో నిర్మాత చెప్పుకొచ్చారు.ఇదిలా వుంటే తాజాగా ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది.
గ్రాఫిక్స్ ప్రాధాన్యంగా తెరకెక్కుతున్న ఈ సువర్ణ సుందరి సినిమాని మార్చిలో రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా చిత్ర నిర్మాతలు ప్రకటించారు.భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయని దర్శక, నిర్మాతలు ఆ మధ్య మీడియాతో తెలియజేసారు.
ఇందులో పూర్ణ దెయ్యంగా నటిస్తుంది అనే టాక్ వినిపిస్తుంది.హర్రర్ జోనర్ లో ఫాంటసీతో కథాంశంతో వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులని ఎ మేరకు మెప్పిస్తుంది అనేది వేచి చూడాలి.