తరుణ్ నటించి ఉంటే నీస్నేహం మూవీ హిట్టయ్యేది.. నిర్మాత కామెంట్స్ వైరల్!

ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా పరుచూరి మురళి డైరెక్షన్ లో తెరకెక్కిన నీ స్నేహం సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన ఎం.

 Famous Producer Ms Raju Interesting Comments About Nee Sneham Movie Details, Nee-TeluguStop.com

ఎస్.రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.తాజాగా ఎం.ఎస్.రాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ ఇంకో ప్రొడ్యూసర్ ను ఎంకరేజ్ చేయరని ఎం.ఎస్.రాజు తెలిపారు.ఒక సినిమాలో సత్తా లేకపోతేనే ఆ సినిమా పోతుందని ఎం.ఎస్.రాజు అన్నారు.తాను తన సినిమాలకు పోటీగా విడుదలైన సినిమాలు హిట్ కావాలని కోరుకుంటానని ఎం.ఎస్.రాజు తెలిపారు.గతేడాది బన్నీ, మహేష్ సినిమాలు సక్సెస్ సాధించాయని ఎం.ఎస్.రాజు చెప్పుకొచ్చారు.అయితే తన విషయంలో మాత్రం నిర్మాతలు బాగానే ఉంటారని ఎం.ఎస్.రాజు వెల్లడించారు.

ఒక శాతం పీపుల్ మాత్రం మనస్సులో పెట్టుకుని బిహేవ్ చేస్తారని అలాంటి వ్యక్తులు తన చుట్టూ ఉండరని ఎం.ఎస్.రాజు అన్నారు.

Telugu Aarti Aggarwal, Bunny, Dirty Hari, Tharun, Mahesh, Raju, Raju Nee Sneham,

నాతో ట్రావెల్ అయిన వాళ్లలో అందరికీ తాను మంచే చేశానని ఎం.ఎస్.రాజు పేర్కొన్నారు.కాంపిటీషన్ ఉంటుందని ఆ సమయంలో కోపాలు ఉంటాయని ఆయన తెలిపారు.తొలి సినిమా సమయంలో నిర్మాతగా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని ఎం.ఎస్.రాజు వెల్లడించారు.

Telugu Aarti Aggarwal, Bunny, Dirty Hari, Tharun, Mahesh, Raju, Raju Nee Sneham,

నీ స్నేహం సినిమా యావరేజ్ గా ఆడిందని సినిమా చూస్తున్న సమయంలో ఉదయ్ కిరణ్ తో పాటు తరుణ్ లాంటి వ్యక్తిని స్నేహితుని పాత్రలో పెట్టి ఉంటే బాగుండేదని ఎం.ఎస్ రాజు అన్నారు.స్నేహితుని పాత్రలో హీరో స్థాయి వ్యక్తిని పెట్టి ఉంటే సినిమా ఫలితం మరో విధంగా ఉండేదని ఎం.ఎస్ రాజు పేర్కొన్నారు.ఎం.ఎస్ రాజు డైరెక్షన్ లో పలు సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే.డర్టీ హరి సినిమాతో ఎం.ఎస్ రాజు సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube