మామూలుగా తెలుగు సినిమా హీరోలకు ఉన్నంత డిమాండ్ మిగతా ఇండస్ట్రీలో హీరోలకు లేదంటే పెద్దగా అతిశయోక్తి కాదు.పైగా మన హీరోలు అందరూ కూడా బ్యాగ్రౌండ్ ఉన్నవారే ఎక్కువగా ఉండటం విశేషం.
అందుకే వారు లగ్జరీ కార్లు, విలాసవంతమైన హౌసులు, ఖరీదైన ఫోన్లు వాడుతూ ఉంటారు.వీలు దొరికితే బయట దేశాలకు రిలాక్స్ అవ్వడం కోసం ట్రిప్పులు కూడా వేస్తారు.
ఇక మన హీరోలు వేసుకునే బట్టలు, వాచ్ లు, షూలు ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో నిత్యం సంచలనంగా మారుతూ ఉంటాయి.సెలబ్రిటీల విషయాలు( Celebrities Secrets ) తెలుసుకోవడానికి నెటిజెన్స్ ఎప్పుడు ఆసక్తి చూపుతూ ఉంటారు వారి వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయి? ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరితో డేటింగ్ లో ఉన్నారు.ఎవరిని ఇష్టపడుతున్నారు రెగ్యులర్ గా ఏం చేస్తారు ఏం తింటారు అనే విషయాల గురించి ఎప్పుడు ఆన్లైన్లో చర్చ జరుగుతుంది.
ప్రస్తుతం నాగచైతన్య( Akkineni Nagachaitanya ) గురించి ఒక విషయం తెలిసి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదేంటంటే నాగ చైతన్య చాలా సైలెంట్ గా ఉంటాడు, ఎవరితోనూ ఎక్కువగా కలవడు, ఆయన చెప్తే తప్ప ఆయన వ్యక్తిగత విషయాలు బయటకు రావు.అలాగే ఎవరితో అయిన డేటింగ్ అంటూ వార్తలు వచ్చిన పెద్దగా రియాక్ట్ అవ్వడు.
సమంత( Samantha )తో ప్రేమ విషయం కానీ పెళ్లి విషయం లేదా డివోస్ విషయం ఎంత వైరల్ వార్త అయినప్పటికీ, ఎవరు ఎలాంటి పుకార్లు పుట్టించినప్పటికీ నాగచైతన్య బయటకు వచ్చి ఏ వార్తలను ఖండించలేదు.అంతేకాదు సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది అంటే మొబైల్ ఫోన్ కూడా తీసుకెళ్లడు అనే విషయం ఇటీవలే బయటకు వచ్చింది.
అంత పెద్ద స్టార్ హీరో మనవడు మరియు నాగార్జున( Nagarjuna ) కొడుకు అయిన నాగ చైతన్య ఇంత డిసిప్లిన్ గా ఉంటాడు అంటే ఆశ్చర్యం కలగక మానదు.
తండ్రి తాతల నుంచి వచ్చిన ఆ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నాగచైతన్య షూటింగ్ కి వెళ్లేముందు ఫోన్( Nagachaitanya Mobile Phone ) ని పక్కన పెట్టేస్తాడట సెట్లో ఖాళీగా సమయం దొరికిన సరే ఫోన్ వాడడట.అసలే ఫోన్ కల్చర్ ఎక్కువైపోయినా ఈరోజుల్లో ఇలా ఫోన్ కి దూరంగా ఉండటం అనేది కేవలం నాగచైతన్యకే చెల్లింది.మామూలుగా అయితే మన తారలు అందరూ 24 గంటలు సోషల్ మీడియాలో ఉంటున్నారు.
అందుకే నాగచైతన్య ఈ విషయంలో వెరీ స్పెషల్.సమంత విడిపోయిన తర్వాత కొన్నాళ్లపాటు డిప్రెషన్ కి వెళ్ళిన నాగచైతన్య ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడు అతని జీవితంలోకి ఒక మంచి అమ్మాయి రావాలని కోరుకుందాం.