భారత జట్టు ఆ స్టార్ క్రికెటర్లపై అంపైర్ షాకింగ్ కామెంట్స్ ..!

ప్రపంచ క్రికెట్ ను శాసించే స్థాయిలో బీసీసీఐ( BCCI ) ఎదిగిన సంగతి అందరికీ తెలిసిందే.కాబట్టి బీసీసీఐ ఏ విషయంలో అయినా నిర్ణయం తీసుకుంటే తర్వాత మార్చే అవకాశం ఉండదు.

 The Umpire's Shocking Comments On The Star Cricketers Of The Indian Team , Crick-TeluguStop.com

ఆ విషయం ఆసియా కప్ టోర్నీ విషయంలో అందరికీ తెలిసిపోయింది.ప్రస్తుతం బీసీసీఐ అంటే నిర్ణయం తీసుకునే ముందు మాత్రమే ఆలోచిస్తుంది.

నిర్ణయం తీసుకున్నాక మార్పు ఉండదు.అయితే భారత క్రికెటర్ల( Indian cricketers ) విషయానికి వస్తే మైదానంలో అయినా, బయట అయినా భిన్నమైన శైలిలో ఉంటారు.

భారత జట్టు ఆ స్టార్ క్రికెటర్ల పై ఓ అంపైర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.

ఇంతకు ఆ అంపైర్ ఎవరు.ఎందుకు కామెంట్ చేశాడో అని వివరాలు చూద్దాం.

Telugu Bcci, Cricketers, Latest Telugu, Umpire, Virat Kohli-Sports News క్

అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేసుకున్న అంపైర్ నితిన్ మీనన్( Umpire Nitin Menon ) భారత జట్టు ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ గా బలపడేందుకు నితిన్ మీనన్ ఎంతో కృషిచేసి తనదైన ముద్ర వేసుకున్నాడు.ప్రస్తుతం ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా ( England-Australia )మధ్య జరుగుతున్న యాసెస్ సిరీస్ లో కూడా నితిన్ మీనన్ అంపైరింగ్ చేస్తున్నాడు.ఇదిలా ఉండగా భారత్ లోని స్టార్ ఆటగాళ్లు తనపై ఒత్తిడి చేశారని మీనన్ పీటీఐ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు.

చాలాసార్లు భారత ఆటగాళ్లు తనపై ఒత్తిడి చేశారని, వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారని తెలిపారు.వారు ఎంత ఒత్తిడి తెచ్చిన పరిస్థితి ఎదుర్కోవడానికి తాను బలంగా ఉన్నానని, అలా ఎదుర్కోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగిందని తెలిపాడు.

Telugu Bcci, Cricketers, Latest Telugu, Umpire, Virat Kohli-Sports News క్

నితిన్ మీనన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli )గురించే అని అందరూ చర్చించుకుంటున్నారు.ఎందుకంటే విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో చాలాసార్లు విరాట్ కోహ్లీకి వ్యతిరేకంగా నితిన్ నిర్ణయాలు తీసుకున్నాడు.ఈ నిర్ణయాలు క్రికెట్ అభిమానులను ఎంతగానో నిరాశపరచాయి.నితిన్ మీనన్ స్వస్థలం మధ్యప్రదేశ్.జూన్ 2020 నుంచి అంపైరింగ్ ప్రారంభించిన నితిన్ ఇప్పటివరకు 15 టెస్టులు, 20 టీ20 లు, 24 వన్డే మ్యాచ్ లకు అంపైరింగ్ చేశాడు.అయితే ఆంపైర్ చేసిన కీలక వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల మధ్య చర్చకు దారి తీస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube