కెసిఆర్ ఢిల్లీ పర్యటన లో విస్తృతస్థాయి పర్యటన

ప్రశాంత్ కిషోర్ మధ్యవర్తిత్వం చేసిన,కెసిఆర్ కు అఖిలేష్ యాదవ్ కు బేరాలు కుదరక కెసిఆర్ వెంటనే తెలంగాణ కు తిరిగి వచ్చాడని .ఈసారి నరేంద్రమోడీ నగరానికి పర్యటనకు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించడంతో, ఇక్కడ తెలంగాణా పన్నుల డబ్బులను తీసుకుపోయి ఇతర రాష్ట్రాల్లో పంచుతున్నాడని,నేను విమర్శించడంతో కెసిఆర్ కు భయం పెరిగిపోయి వెంటనే తెలంగాణ కు వచ్చాడని KA PAUL అన్నారు.

 Extensive Tour In Kcr Delhi Tour , Kcr, Delhi Tour, Prashant Kishore, Akhilesh Y-TeluguStop.com

ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా.ఇవ్వాలని  2015లో మీరు ప్రవేశపెట్టిన GO 173 ను సవరించి ఎక్స్‌గ్రేషియాను 25 లక్షలుగా పెంచాలి.

అంటే కాకుండా రాష్ట్రంలో ఎవరైతే కౌలు రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారో వారి కుటుంబాలకు 20 లక్షల చొప్పున తక్షణమే ప్రత్యేక GO ను ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలి.

మీరు అధికారంలోకి వచ్చిన నాటినుండి నేటివరకు ఏంత మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారో వారిలో ఎంతమందికి మీరు తెచ్చిన GO 173 ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందో వెంటనే కెసిఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని తెలంగాణ రైతాంగం తరుపున డిమాండ్ చేస్తున్నాను.

తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేయడం కాదు.ఢిల్లీని ఏలుతనంటున్నడు.

ఇది ఎట్లుంది అంటే ఉట్టికెగరలేనయ్యా… దేశమంతా నాదే అన్నడంట ఎనకటికి ఎవడో … నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఐన తెలంగాణ రాష్ట్రమ్ నీ పరిపాలించాలని తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే ఎనిమిదేళ్ల కాలం లో లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి,అందు లో లక్షల కోట్లు స్కాములు చేసి తన కుటుంబాలకు ఉద్యోగాలు, పదవులు వగైరా వగైరా లాంటివి పంచుతూ తెలంగాణ ప్రజలకు మాత్రం మొండిచేయి చూపుతున్నాడు.కెసిఆర్ ఢిల్లీ పర్యటన లో విస్తృతస్థాయి పర్యటన అంటున్నాడు.

ఢిల్లీ, పంజాబ్, హర్యానా, కర్ణాటక,మహారాష్ట్రలలో రైతు ఉద్యమాల్లో అసువులు బాసిన సుమారు 600 కుటుంబాలకు ఒక్కొక్కరికి 3లక్ష రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేస్తున్నారని తెలిసింది .అంటే అక్షరాల 18 కోట్లు.ఎవడబ్బ సొమ్మని కేసీఆర్ ….!.ఇక్కడి రైతులు చస్తుంటే దిక్కు లేదు కానీ ఇక్కడి సొమ్మును ఇతర రాష్ట్రాల ప్రజలకు ఇచ్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారు.అక్కడి రాష్ట్రాలు లేదా కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి నీకెందుకయ్యా …?నీ సొంత డబ్బు ఏదైనా ఉంటే పంచుకో అంతేగాని రాష్ట్ర ప్రజలు పన్నుల ద్వారా వచ్చిన డబ్బును ఇతర రాష్ట్ర ప్రజలకు ఇస్తే ఊరుకునేది లేదు.కేంద్ర ప్రభుత్వానికైనా , జాతీయ రాజకీయలకైనా నువ్వు ప్రత్యామ్నాయం కాలేవు కేసీఆర్ .

నేనే ప్రత్యామ్నాయం ప్రజల పట్ల అంత ప్రేమగా ఉంటే ముందు నువ్వు ఇక్కడ అప్పులు చేసి ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల కుటుంబాలకు సాయంగా ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున తక్షణమే చెక్కులను ఇవ్వలి లేదంటే నేను తెలంగాణ రైతుల కోసం అసెంబ్లీ ముందు ధర్నా చేస్తా.రోడ్లపై తెగించి… కొట్లాడి….ప్రాణాలను త్యాగం చేసి ….సాధించుకున్న తెలంగాణ ప్రజలకు నీతో మాట్లాడెందుకు సమయం ఇవ్వడం చేత కాదు కానీ,,ఇతర రాష్ట్రాల ప్రజలను కలిసి వారి సాధక, బాధకాలను తీరుస్తాను అంటూ దేశదిమ్మరి లా పర్యటనలు చేస్తున్నావు.సిగ్గు లేదా అని అడుగుతున్నా? తెలంగాణ ప్రజలారా ఇకనైనా మీరు మేల్కోండి కెసిఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు.ఇకనైనా మీరు మేల్కోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube