తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది.ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడోసారి జరిగిన ఈ ఎన్నికలలో.
కాంగ్రెస్ 60 స్థానాలకు పైగా గెలవడం జరిగింది.దీంతో అధికారం కైవసం చేసుకోవడంతో బీజేపీ నేత ఈటల రాజేందర్.
శుభాకాంక్షలు తెలియజేశారు.హుజురాబాద్ లో ఈటల పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఈ సందర్భంగా ప్రజల తీర్పును శిరసా వహిస్తున్నట్లు.గెలిచిన వారికి అభినందనలు అని సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.
“ప్రజా తీర్పును శిరసావహిస్తున్నా, గెలిచినవారికి అభినందనలు.నన్ను ప్రేమించి, దీవించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదములు.హుజురాబాద్ ప్రజలు ఇన్నేళ్లుగా వారికి సేవ చేసే భాగ్యాన్ని కలిగించారు.వారి రుణం తీర్చుకోలేనిది.ఫలితాన్ని జీర్ణించుకోలేక పోతున్న కార్యకర్తలు, అభిమానులు ప్రతిఒక్కరికీ నా వినమ్ర విజ్ఞప్తి ఎవరూ ఆవేదన చెందవద్దు.ప్రజల తీర్పును గౌరవిద్దాం.
గజ్వేల్ లో అతితక్కువ కాలమే అయినా ఆదరించి, ఆశీర్వదించి ఓట్లు వేసిన ప్రజలకు పనిచేసిన కార్యకర్తలు, నాయకులు ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు.గెలుపొందిన బిజెపి అభ్యర్థులకు హార్దిక శుభాకాంక్షలు.
ప్రజల సమస్యలను అసెంబ్లీ సాక్షిగా వినిపించాలని కోరుకుంటున్నాను.అధికారం చేపట్టబోతున్న కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు.
ఈ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గెలుపుకోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.జై తెలంగాణ.
భారత్ మాతాకీ జై”…అని ట్వీట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది.