అర్హులైన యువత ఓటు నమోదు చేసుకోవాలి - కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: అర్హులైన యువత ఓటు హక్కు నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి పిలుపు నిచ్చారు.ప్రత్యేక ఓటరు సంక్షిప్త, పునరీక్షన కార్యక్రమం లో భాగంగా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ జడ్పీ స్కూల్ లోని 242,243,244 నంబర్ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నమోదును కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు.

 Eligible Youth Should Register To Vote - Collector Anurag Jayanti, Eligible Yout-TeluguStop.com

అనంతరం అదే ఆవరణలోని ప్రాథమిక స్కూల్ ను సందర్శించి, సౌకర్యాలు పరిశీలించి, విద్యార్థుల సంఖ్య, హాజరు శాతం అడిగి తెలుసుకున్నారు.అదే మండలంలోని మారుమూల గ్రామమైన కమ్మరి పేట తండాలోని 224 పోలింగ్ కేంద్రాన్ని, అలాగే రామన్నపేటలోని 251 ఓటరు పోలింగ్ కేంద్రం లోని ఓటింగ్ నమోదు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్ల సంఖ్య ఎంత? కొత్తగా ఎంత మంది ఓటర్లను నమోదు చేశారు? చనిపోయిన, డబుల్ గా నమోదైన ఓటర్ల తొలగింపు తదితర అంశాలను కలెక్టర్ బూత్ లెవెల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.జనవరి 1వ తేదీ 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువత తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకునేలా చూడాలని.

ఏ ఒక్కరూ మిస్ ఔట్ కావొద్దనీ బూత్ లెవెల్ అధికారులకు సూచించారు.ప్రత్యేక ఓటరు సంక్షిప్త, పునరీక్షన కార్యక్రమంలో భాగంగా ఆదివారo(నేడు )సైతం ఓటరు జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులు చేసుకునే కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

అందరూ బూతు లెవల్ అధికారులు తమ పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉండాలని సూచించారు.తనిఖీలో కలెక్టర్ వెంట కోనరావు పేట, తహశీల్దార్ విజయ ప్రకాశ్ రావు తదితరులు ఉన్నారు.

అదనపు కలెక్టర్ తనిఖీ ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి, వెంకటాపూర్, సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్ధాపూర్, తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి, మల్లాపూర్ గ్రామాల్లోని పోలింగ్ బూత్ లలో చేపడుతున్న ప్రత్యేక ఓటరు సంక్షిప్త, పునరీక్షన కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ పి.గౌతమి పరిశీలించారు.అలాగే సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, మధుసూధన్ లు క్షేత్ర స్థాయిలో పలు పోలింగ్ బూత్ లను పరిశీలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube