అష్టాదశ పురాణాలు ఏవి ? వాటి విశిష్టత ఏమిటి ?

1) బ్రహ్మ పురాణం :

దీనికి ఆది పురాణం అనే పేరు ఉంది.పేరుకే బ్రహ్మ పురాణం కాని, బ్రహ్మని పరమాత్మగా చూపదు.మహావిష్ణువు దశల గురించి, శివుడి గురించి ఎక్కువ చర్చ ఉంటుంది.

 Eighteen Puranas And Their Themes, Puranas , Eighteen Puranas , Vamana Puranam-TeluguStop.com

2) పద్మ పురాణం :


విష్ణువు నుంచి చూస్తే ఈ బ్రహ్మాండం ఏమిటి ? విష్ణు అవతారాల గురించి ఉంటుంది.ఇందులోనూ రాముడు – సీత కథ ఉన్నా, రామాయణంకి భిన్నంగా ఉంటుంది.

3) విష్ణు పురాణం :

మహావిష్ణువు గురించి, పరమాత్మ మహావిష్ణువుగా వివరంగా ఉంటుంది.అయితే కాలక్రమంలో దీని చాలా మారుస్తూ వచ్చారని చెబుతారు.

4) శివ పురాణం :

శైవం గురించి చెబుతుంది.శివుడి నుంచే విష్ణువు, బ్రహ్మ వచ్చినట్లు చెబుతుంది.

5) భాగవత పురాణం :

అత్యధిక ప్రజాదారణ పొందిన పురాణం, అత్యధిక మందికి తెలిసిన పురాణం.విష్ణువు అవతారాల గురించి చెబుతుంది.

6) నారద పురాణం :

భారతదేశంలో ఉన్న పవిత్ర నదుల గురించి చెబుతుంది.గ్రహాల గురించి చెబుతుంది.విష్ణువు, శివుడు, కృష్ణుడు, లక్ష్మిదేవి గురించి విపులంగా ఉంటుంది.

7) మార్కండేయ పురాణం :

వైష్ణవం, శైవంకి భిన్నంగా, శక్తి గురించి చెప్పే పురాణం ఇది.అంటే నారాయణుడు కాదు, శివ పురాణంలో చెప్పినట్టు శివుడు కాదు, ఆదిశక్తి, అంటే ఓ మహిళని సృష్టికర్తగా చూపుతుంది.

8) అగ్ని పురాణం :

రాజకీయాలు, వాస్తు శాస్త్రం, సైన్యం, సైన్స్ .ఇలా ఇప్పుటి ప్రపంచంలో ఉన్న ఎన్నో విషయాల గురించి అప్పుడే చెప్పారు.

9) బ్రహ్మాండ పురాణం :

న్యాయం, ప్రభుత్వాలు, రాజకీయాలు ఇలాంటి అంశాలు ఎన్నో ఉంటాయి.లలీత సహస్ర నామాలు ఇందులో ఉండటం విశేషం.

10) మత్స్య పురాణం :

పేరుకి తగ్గట్టే విష్ణుమూర్తి పది అవతారాల్లో ఒకటైన మత్స్య అవతారం గురించి చెబుతుంది.బ్రహ్మ – సరస్వతి బంధం, నర్మదా నది విశిష్టత ఇతర ప్రధాన అంశాలు.

11) బ్రహ్మవైవర్త పురాణం :

దేవుళ్ళు, దేవతల ప్రేమకథలు ప్రధాన అంశం.

12) వామన పురాణం :

ఇది ఒకప్పుడు వైష్ణవంకి సంబంధించిన పురాణం అంట.ఇప్పుడు శైవంకి సంబంధించింది అని చెబుతారు.మార్పులు జరిగాయి అంట.

13) లింగ పురాణం :

శివుడు లింగాన్ని సృష్టికి మూలంగా చూపుతుంది.బ్రహ్మ – విష్ణువుల గొడవ కథ ఇందులోదే.

14) వరాహ పురాణం :

పేరులో ఉన్నట్లే నారాయణుడి వరాహ అవతారం ప్రధానం అంశం.అయితే కృష్ణుడు మరియు దుర్గ గురించి కూడా వివరాలు ఉంటాయి.

15) వాయు :

అతి ప్రాచీనమైన పురాణాల్లో ఒకటి.తెలుగు రాష్ట్రాలు తెలంగాణ – ఆంధ్ర ప్రదేశ్ గురించి కూడా ఇందులో ఉండటం విశేషం.

16) స్కంద పురాణం :

శివుడి కుమారుడు కార్తికేయుడి గురించి ఎక్కువ ఉంటుంది.భారత దేశంలోని పవిత్ర స్థలాల గురించి కూడా ఉంటుంది.

17) కుర్మ పురాణం :

నారాయణుడి అవతారం కుర్మ గురించి ఇందులో ఉంటుంది.అత్యంత ఆసక్తికరమైన పురాణంగా దీనికి పేరు.

18) గరుడ పురాణం :

ఈ పురాణం గురించి మీకు తెలిసిందే.స్వర్గం, నరకం, జన్మలు పునర్జన్మలు, పాపలు, పుణ్యాలు, శిక్షలు .ఇలా అన్ని ఉంటాయి.ఇది కూడా వైష్ణవ పురాణం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube