ఏపీలో రాజకీయాలు క్షణక్షణం ఊహించని మలుపులు తిరుగుతున్నాయి.రోజుకో కొత్త చర్చ తెరపైకి వస్తూ అందరినీ ఏపీ రాజకీయాల వైపు చూసేలా చేస్తున్నాయి.
నిన్న మొన్నటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు జైలు ఎపిసోడ్ ఎంతటి హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే.ఇక దాదాపు 52 రోజుల తరువాత ఈ మద్యనే ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో ఆ అంశంపై వేడి తగ్గింది, ఇక ఇప్పుడు కొత్తగా జగన్( CM jagan ) ను ఇరకాటంలో పెట్టె అంశాలు తెరపైకి వస్తూ మరింత కాక పుట్టిస్తున్నాయి.

ఏపీలో ఆర్థిక పరమైన అవకతవకలు జరుతున్నాయని, వైసీపీ సర్కార్ ప్రవేశ పెడుతున్న పథకాల చాటున పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయని వైసీపీ రెబెల్ ఎంపీ రంగురమ కృష్ణరాజు( Raghu Rama Krishna Raju ) ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేశారు.ఈ పిటిషన్ పై వివరణ కోరుతూ వైఎస్ జగన్ తో పాటు 41 మందికి నోటీసులు కూడా పంపింది హైకోర్టు.దాంతో ఈ పిటిషన్ కు సంబంధించిన విచారణను డిసెంబర్ 14 కు వాయిదా వేసింది ధర్మాసనం.అయితే ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న రఘురామ కృష్ణరాజు సడన్ గా జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా పిటిషన్ వేయడం ఏంటనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.

రఘురామ పిటిషన్ వెనుక చంద్రబాబు( Chandrababu ) ఉన్నాడనేది కొందరి అభిప్రాయం.తనను జైలు పంపిన జగన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు చంద్రబాబు ప్రణాళిక బద్దంగా రఘురామ తో పిటిషన్ వేయించాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.పస్తుతం ఏపీలో చాలానే సంక్షేమ పథకాలు అమలవుతున్న సంగతి తెలిసిందే.దాదాపు అని పథకాలు కూడా నగదు పంపిణీ కి సంబంధించినవే.దాంతో ప్రస్తుతం రఘురామ వేసిన పిటిషన్ జగన్ కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది.రఘురామ పిటిషన్ పై విచారణ ముందుకు సాగితే జగన్ సర్కార్ అమలు చేస్తున్న చాలా పథకాలపై పూర్తి నివేధిక ఇవ్వాల్సివుంటుంది.
దీంతో ఈ ఊహించని పరిణామం నుంచి వైఎస్ జగన్( YS Jagan ) ఎలా బయటపడతారో చూడాలి.