మిస్ వరల్డ్ అమెరికా అయినా మూలాలు మరవని వైనం.. అమ్మమ్మ తాతయ్యల కోసం భారతదేశానికి

మిస్ వరల్డ్ అమెరికా టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ అమెరికన్ యువతి శ్రీషైనీ భారత్‌లో పర్యటిస్తున్నారు.పంజాబ్‌లో నివసిస్తున్న తన అమ్మమ్మ తాతయ్య విజయలక్ష్మీ, తిలక్‌రాజ్ సచ్‌దేవాలను కలిసేందుకు ఆ రాష్ట్రానికి చేరుకున్నారు.

 Miss World America Shree Saini Reached India To Meet Her Maternal Grandparents ,-TeluguStop.com

ఈ సందర్భంగా అబోహర్ నగరంలోని రాజయోగ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రపంచ శాంతి కోసం ప్రార్థించారు.ఈ సందర్భంగా స్థానిక బ్రహ్మకుమారి సెంటర్ ప్రతినిధులు శ్రీషైనీని సత్కరించి, భవిష్యత్త్‌లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Telugu Blue Flak Award, Harvard, America, Jersey, Shree Saini, Stand, Tilakraj,

కాగా.శ్రీషైనీ మిస్ వరల్డ్ అమెరికా 2021 టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించారు.వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన ఈ అమ్మాయి.ఈ కిరీటం పొందిన తొలి ఇండో అమెరికన్‌గా రికార్డుల్లోకెక్కింది.ఇంతటి ఘనత సాధించిన ఆమె జీవితం పూల పాన్పు కాదు.ఇక్కడి దాకా రావడానికి షైనీ ఎన్నో కష్టాలు పడింది.గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ షైనీకి.12 ఏళ్ల వయసులోనే శాశ్వతంగా పేస్‌మేకర్ అమర్చారు.అంతేకాదు ఒక కారు ప్రమాదంలో షైనీ ముఖం కాలిపోయింది.కానీ మొక్కవోనీ దీక్షతో మామూలు మనిషి అయ్యింది.న్యూజెర్సీలోని ఫోర్ట్స్ సిటీలో 2018లో జరిగిన పోటీలలో శ్రీషైనీ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ కిరీటాన్ని కూడా గెలుచుకున్నారు.

Telugu Blue Flak Award, Harvard, America, Jersey, Shree Saini, Stand, Tilakraj,

పంజాబ్ రాష్ట్రం లూధియానాలో 1996 జనవరి 6న జన్మించారు శ్రీషైనీ.ఆమెకు ఐదేళ్లు వున్నప్పుడే షైనీ కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది.బాల్యంలో వున్నప్పుడే పేదరికాన్ని చాలా దగ్గరి నుంచి చూసిన ఆమె.పిల్లలకు అందమైన బాల్యాన్ని అందించాలనే సామాజిక బాధ్యతను స్వీకరించాలని అప్పుడే నిర్ణయించుకున్నారు.12 ఏళ్ల వయసున్నప్పుడు షైనీ హృద్రోగం బారినపడ్డారు.ఆమె హృదయ స్పందన నిమిషానికి కేవలం 20 బీట్స్‌గానే వుండేది.దీంతో ఆమె మళ్లీ డ్యాన్స్ చేయడం కుదరదని వైద్యులు వారి కుటుంబానికి తెలిపారు.కానీ మొక్కవోనీ దీక్షతో శ్రీషైనీ గంటల తరబడి ప్రాక్టీస్ చేసి డ్యాన్స్‌లో పట్టు సంపాదించింది.షైనీ హార్వర్డ్ యూనివర్సిటీ, యేల్ స్కూల్ ఆఫ్ డ్రామా, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం, వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube