Omicron : అమెరికాలో విస్తరిస్తోన్న ఒమిక్రాన్.. 4 రాష్ట్రాల్లో కేసులు, న్యూయార్క్‌లో అత్యధికం

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాప కింద నీరులా ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది.ఇప్పటికే 30కి పైగా దేశాల్లో 370కి పైగా కేసులు వెలుగుచూశాయి.

 Covid 19 New Variant Omicron Found In Four Us States-TeluguStop.com

భారత్‌లో కూడా ఒమిక్రాన్ ప్రవేశించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఇప్పటికే వెలుగు చూసిన దేశాల్లో ఈ మహమ్మారి అమితమైన వేగంతో దూసుకెళ్తోంది.ఈ క్రమంలోనే అగ్రరాజ్యం అమెరికాలోనూ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది.ఇప్పటి వరకు అక్కడ నాలుగు రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.

అమెరికాలో తొలికేసు నవంబర్‌ 25న కాలిఫోర్నియాలో నమోదవ్వగా… ఇప్పుడు అది మిన్నెసొటా, న్యూయార్క్‌, కొలరాడోకు విస్తరించింది.అత్యధికంగా న్యూయార్క్‌లో 5 కేసులు వున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇందులో 67 ఏండ్ల మహిళ కూడా ఉన్నారని, స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.ఆమె ఈమధ్యే దక్షిణాఫ్రికా వెళ్లి.

నవంబర్‌ 25న అమెరికాకు తిరిగి వచ్చారని, గత మంగళవారం ఆమెకు కరోనా పాజిటివ్‌‌గా తేలిందని అధికారులు వెల్లడించారు.ఈ నేపథ్యంలో న్యూయార్క్ గవర్నర్ క్యాథి హోచుల్ స్పందించారు.

‘వ్యాక్సిన్‌.బూస్టర్‌ తీసుకుని, మాస్క్‌ ధరించాలని ట్వీట్‌ చేశారు.

Telugu Calinia, Central, Medicaladviser, Colorado, Covid Omicron, Minnesota, Yor

మరోవైపు ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో చీఫ్‌ మెడికల్‌ అడ్వైజర్‌ ఆంథోనీ ఫౌచీ స్పందించారు.పౌరులంతా వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని.అలాగే బూస్టర్‌ డోసు విషయంపైనా ఆలోచించాలని ఫౌచీ చెప్పారు.బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.అటు కొత్త వేరియంట్ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణీకులపై కఠిన ఆంక్షలు విధించేందుకు సైతం అగ్రరాజ్యం సిద్ధమౌతోంది.అలాగే కోవిడ్ పరీక్షలు, ఇతర నిబంధనల్ని కఠినతరం చేయనుంది.

అమెరికాకు వచ్చే ప్రయాణీకులు 72 గంటలు ముందు కాకుండా ఒకరోజు ముందు పరీక్షలు చేయించుకునేలా నిబంధనలు రానున్నాయి.వ్యాక్సిన్ తీసుకున్నా, తీసుకోకపోయినా కొత్త నిబంధనలు వర్తించనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube