ఈ సీజన్ ఐపీఎల్( IPL ) లో గ్రాండ్ విక్టరీని కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి డీలా పడిపోయింది.ఇక మొదటి మ్యాచ్ లోనే బెంగళూరు( Bangalore ) లాంటి ఒక పెద్ద టీం ను ఓడించి భారీ విక్టరీని సంపాదించుకున్న చెన్నై టీం ప్రస్తుతం వరుస ఓటములకు కారణం ఏంటి అని ఆ టీం యాజమాన్యం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక గత మ్యాచ్ లో ఢిల్లీ టీమ్ మీద ఓడిపోయిన చెన్నై రీసెంట్ గా హైదరాబాద్ టీం మీద కూడా దారుణంగా ఓడిపోయింది.దానికి కారణం ఏంటి అనే విషయాల మీద ధోని కానీ టీమ్ యాజమాన్యం కానీ తీవ్రమైన చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇలాంటి క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం మిగితా మ్యాచ్ లు కూడా ఇలాగే ఆడితే మాత్రం వాళ్ళు ప్లే ఆఫ్ కి చేరుకునే అవకాశాలు చాలా కష్టం అవుతాయనే చెప్పాలి.
ఇక ఈ సీజన్ ను ఫెలవంగా మొదలుపెట్టిన సన్ రైజర్స్ టీం( Sunrisers team ) లాంటి ప్రస్తుతం రాణిస్తూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే చెన్నై గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు డీలా పడటం చెన్నై టీం అభిమానులను తీవ్రంగా కలిచివేస్తుంది.ఇక తొందరగానే వాళ్ళు చేసిన మిస్టేక్స్ ని తెలుసుకొని మంచి పర్ఫామెన్స్ ని ఇవ్వగలిగితే మళ్లీ చెన్నై పుంజుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.కానీ ఇదేవిధంగా ఫేలవమైన పర్ఫామెన్స్ ఇస్తే మాత్రం చెన్నై టీం కి చాలా ఓటములు చవి చూడల్సి వస్తుందనే చెప్పాలి.
ఇక కొత్త కెప్టెన్ గా వచ్చిన ఋతురాజ్ గైక్వాడ్( Rituraj Gaikwad ) మొదటి రెండు మ్యాచ్ ల్లో తనదైన రీతిలో మంచి కెప్టెన్సీ చేసి మంచి విజయాన్ని అందించాడు.
ఇక ఈ రెండు మ్యాచ్ ల్లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.ఇక ముఖ్యంగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో వాళ్ల బౌలర్లు వాళ్ల బౌలింగ్ తో చెన్నై బ్యాట్స్ మెన్స్ ను బెంబే లెత్తించారనే చెప్పాలి.చెన్నై ఈ మ్యాచ్ లో కేవలం 165 పరుగులు మాత్రమే చేయడం అనేది నిజంగా ఆ టీం యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తుంది.
టీమ్ మొత్తం స్టార్ బ్యాట్స్ మెన్స్ ఉన్నప్పటికీ వాళ్ళందరూ తక్కువ స్కోరు చేయడం అనేది వాళ్ళు చేసిన భారీ మిస్టేక్ గా తెలుస్తుంది…