కమల్ హాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన విక్రమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.చాలా సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
విక్రమ్ సినిమా సక్సెస్ సాధించడం వల్ల కమల్ హాసన్ అప్పులు తీరిపోవడంతో పాటు నిర్మాతగా ఊహించని లాభాలు ఆయనకు దక్కాయి.
రెండు వారాలలో ఈ సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది.
తమిళంలో బాహుబలి2 క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేసి ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేయడం గమనార్హం.విక్రమ్ సినిమాలో ప్రతి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోగా ఏజెంట్ టీనా రోల్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసిందనే సంగతి తెలిసిందే.
ఏజెంట్ టీనా రోల్ లో నటించి మెప్పించిన నటి ఎవరా అని అభిమానుల మధ్య కూడా చర్చ జరుగుతోంది.
అయితే ఏజెంట్ టీనా పాత్రను పోషించిన నటి గురించి తాజాగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ నటి అసలు పేరు వాసంతి అని సమాచారం.ఈమె తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ గా ఉన్నారు.చాలామంది స్టార్ హీరోల సినిమాలకు ఆమె కొరియోగ్రాఫర్ గా వ్యవహరించడం గమనార్హం.విక్రమ్ సినిమాతో వాసంతి నటిగా కెరీర్ ను మొదలుపెట్టారు.

వాసంతి తన రోల్ గురించి మాట్లాడుతూ విక్రమ్ సినిమాలో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.నా అసలు పేరు వాసంతి అయినా ఏజెంట్ టీనా అని అందరూ పిలుస్తుంటే సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.ఏజెంట్ టీనా యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయని మరి కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







