షూటింగ్ తీసే సమయంలో క్లాప్ బోర్డ్ ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..?!

మనలో చాలా మంది అనేకసార్లు సినిమా షూటింగ్ మొదలయ్యే సమయంలో హీరో లేదా హీరోయిన్ పై క్లాప్ బోర్డ్ ను కొట్టి సినిమాను ఆరంభించే పద్ధతిని మనం గమనిస్తూనే ఉంటాం.ఈ వస్తువు చూడటానికి చిన్నగా కనిపించినప్పటికీ అసలు ఆ క్లాప్ బోర్డు ఎందుకు ఉపయోగిస్తారో అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు.

 Clapping, Director, Clap Board, Hero, Heroine, New Movie Opening, Use Of Clap Bo-TeluguStop.com

ఇకపోతే ఈ క్లాప్ బోర్డు ను సరిగా ఉపయోగిస్తే సినిమాపై అనవసరంగా పెట్టే లక్షల రూపాయల డబ్బులను వృధా కాకుండా అలాగే టైం వేస్ట్ కాకుండా చేసుకోవచ్చు.అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా సులువుగా అవ్వడానికి ఈ బోర్డు ఎంతగానో ఉపయోగపడుతుంది.

వీటితో పాటు అనేక రకాల ఉపయోగాలను ఈ క్లాప్ బోర్డు కలిగి ఉంటుంది.

ఇకపోతే ఈ బోర్డు పై

తేదీ, రోజు, రాత్రి, ఏ సీన్, టేక్

అలాగే ఎన్నో షాట్ నెంబర్స్ లాంటి ఆప్షన్స్ కనబడుతూ ఉంటాయి.

సినిమాకు సంబంధించిన సీన్లను ఓ క్రమపద్ధతిలో కాకుండా వారికి అనువైన పద్ధతిలో తీసుకుంటూ వెళ్తారు.అలా తీసే సమయంలో క్లబ్ బోర్డుతో క్లాప్ కొట్టి ఆ సీన్ మొదలుపెడతారు.

అలా క్లాప్ కొట్టే సమయంలో బోర్డు మీద రాసి ఉన్న పాయింట్స్ ఆధారంగానే ఎడిటర్ సినిమా షూటింగ్ సంబంధించిన సీన్స్ ను ఎంచుకోవడం జరుగుతుంది.ఇలా ఓ వరుస క్రమంలో అమర్చడం ద్వారా ఎడిటర్ కు చాలా పని తగ్గుతుంది.

Telugu Clap Board-Latest News - Telugu

క్లాప్ బోర్డ్ పై ఉన్న వివరాలను అనుసరించి మంచి సీన్లను ఎడిటర్ పిక్ చేసుకుని సినిమాను ముందుకు పోనిస్తారు.వీటితో పాటు ఆ క్లాప్ బోర్డ్ కొట్టినప్పుడు వచ్చే సౌండ్ ఆధారంగా కంటి విజువల్ కి కరెక్టుగా వాయిస్ ఎక్కడ సింక్ చేయాలన్న విషయంపై కూడా స్పష్టత వస్తుంది.ఇలా క్లాప్ బోర్డు ను సినీ దర్శకులు ఉపయోగిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube