బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఒక్క రోజులో రూ.90 కోట్లు వసూల్ చేసిన హాట్ స్టార్?

తెలుగులో బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఇటీవలే గ్రాండ్ గా మొదలైన విషయం అందరికి తెలిసిందే.ఇక బిగ్ బాస్ షో మొదలయ్యి కొద్ది రోజులు కూడా గడవకముందే అప్పుడే కంటెస్టెంట్ ల మధ్య గొడవలు, ఏడుపులు, తగాదాలు మొదలయ్యాయి.

 Disney Plus Hotstar Gets 1 Million Subscribers On Bigg Boss Telugu Ott Launching-TeluguStop.com

ఇదిలా ఉంటే బిగ్ బాస్ నాన్ స్టాప్ షో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటల పాటు ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.నాన్ స్టాప్ కార్యక్రమంగా బిగ్ బాస్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.

ఇప్పటికే తెలుగులో 5 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో, కాగా బిగ్ బాస్ తెలుగు ఓటిటి అంటూ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.

ఐదు సీజన్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

ఇక ఐదవ సీజన్ పై పలురకాల విమర్శలు వినిపించాయి.అంతేకాకుండా టిఆర్పి రేటింగ్ విషయంలో కూడా ఘోరంగా విఫలమయింది.

ఇక ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఓటిటి వేదికగా ప్రసారమవుతున్న ఈ షో ఫై మొదట్లో అందరికీ చాలా అనుమానాలు కలిగాయి.కానీ బిగ్బాస్ మొదలైన తొలి రోజే 10 లక్షలకు పైగా లాగిన్స్ ఈ షో కోసం చేసుకున్నారు.

అంతేకాకుండా తొలి రోజు ఓటీటీ బిగ్ బాస్ కోసం 10 లక్షల మంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు.హాట్ స్టార్ ప్రీమియం ప్లాన్ గురించి మనందరికీ తెలిసిందే.

Telugu Bigg Boss, Biggboss, Disney Hot-Movie

నెలవారి ప్లాన్ 299 కాకుండా, సూపర్ ప్లాన్ 899 ఏడాదిపాటు యాక్టివేట్ చేసుకుంటున్నారు.ఈ విధంగా చూసుకుంటే 10 లక్షలు చూసుకుంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఒకటే రోజు దాదాపుగా 89.9 కోట్లు అనగా 90 కోట్ల ఆదాయం వచ్చింది అన్నమాట.కేవలం లాగిన్ ద్వారానే ఎన్ని కోట్ల ఆదాయం వస్తే మరి యాడ్స్ ద్వారా ఎన్ని కోట్ల ఆదాయం వస్తుందో.

ఇక బిగ్ బాస్ హౌస్ లో కంపచెట్ల మధ్య అప్పుడే వాదోపవాదాలు, వాదనలు, ప్రతి వాదనలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube