అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీలో( TDP ) అసంతృప్త జ్వాలలు కొనసాగుతున్నాయి.ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి( Prabhakar Chowdary ) వర్గీయులు నిరసనకు దిగారు.
ఈ క్రమంలోనే రుద్రంపేట టీడీపీ కార్యాలయంపై( Rudrampeta TDP Office ) దాడికి పాల్పడిన ఆయన అనుచరులు, వర్గీయులు ఆఫీస్ లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు.అనంతరం అర్బన్ నియోజకవర్గ టికెట్ ను పార్టీ అధిష్టానం ప్రభాకర్ చౌదరికి కేటాయించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
బ్యానర్లు, ఫ్లెక్సీలతో పాటు చంద్రబాబు ఫోటోలను తగులబెట్టారు.దీంతో టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.అయితే అనంతపురం అర్బన్ సీటును ప్రభాకర్ చౌదరికి కాకుండా పార్టీ అధిష్టానం దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కు కేటాయించిన సంగతి తెలిసిందే.