'ఓ మై లవ్' టీజర్ విడుదల చేసి చిత్ర దర్శకుడు 'స్మైల్ శ్రీను'ని అభినందించిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు

జి.సి.బి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అక్షిత్ శశికుమార్, కీర్తి కల్కరే హీరో హీరోయిన్స్ గా “బళ్లారి దర్బార్” ఫ్రేమ్ స్మైల్ శ్రీను దర్శకత్వం లో జి.రామంజిని కన్నడ తెలుగు భాషల్లో నిర్మిస్తున్న చిత్రం “ఓ మై లవ్”. ఈ చిత్ర టీజర్ ని లెజెండరీ డైరెక్టర్ దర్శకేంద్రడు కె.రాఘవేంద్ర రావు గారు హైదరాబాద్ తన ఆఫీసులో విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకేంద్రుడు మాట్లాడుతూ… యుంగ్ టెలెంటెడ్ డైరెక్టర్ స్మైల్ శ్రీను తీసిన “ఓ మై లవ్” సినిమా టీజర్ చూసాను కన్నడలో పెద్ద బడ్జెట్ లోవస్తున్న ప్రేమకథ “ఓ మై లవ్” సినిమా క్వాలిటీ చాలా బాగుంది.ఈ చిత్రం తెలుగులో కూడా రావడం సంతోషంగా ఉంది.

 Director Raghavendra Rao Appreciates Director Smile Srinu For Oh My Love Teaser-TeluguStop.com

సినిమాలన్నీ ఇలాగే క్వాలిటీ తో రావాలి.

టీజర్ చూస్తే శీను టేలెంట్ తో బ్యూటిఫుల్ యూత్ ఫుల్ లవ్ సబ్జెక్ట్ తీసుకుని చాలా అందంగా చిత్రీకరించారు.

స్మైల్ శ్రీను దర్శకుడిగా కష్టపడి మంచి క్వాలిటీ సినిమా చేశారు అని ఔట్ పుట్ చూస్తే అర్థమవుతుంది.ఇలాంటి యంగ్ టేలెంటేడ్ స్మైల్ శ్రీను కి ఈ చిత్రం మంచి పేరు తీసుకొచ్చి ప్రొడ్యూసర్ జి.రామంజనికి కన్నడలో తెలుగులో మంచి లాభాలు “ఓ మై లవ్” మూవీ తెచ్చిపెట్టాలి.అలాగే ఈ చిత్రం లో పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు నా అశిష్యులు అని తెలుపుతూ నా సపోర్ట్ ఎప్పుడు మీ “ఓ మై లవ్” మూవీ కి ఉంటుంది ఆని స్మైల్ శ్రీను భుజం తట్టి ప్రోత్సహించారు.

చిత్ర దర్శకుడు స్మైల్ శ్రీను మాట్లాడుతూ… మా తరం దర్శకులకు ఇప్పటి యువ దర్శకులకు “గాడ్ ఫాదర్” దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గారిని అడగగానే మా “ఓ మై లవ్” సినిమా టీజర్ విడుదల చేసి గురువుగారు మాకిచ్చిన బ్లెసింగ్స్ మా టీమ్ అందరికీ శ్రీరామరక్షలా దైర్యన్ని ఇచ్చింది.ఇదే ఉత్సాహం తో మా చిత్రాన్ని త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాము.నా తరపున మా టీమ్ అందరి తరపున మా గాడ్ ఫాదర్ కె.

రాఘవేంద్ర రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.అలాగే త్వరలో మిగతా “ఓ మై లవ్” విడుదల డీటెయిల్స్ తెలియజేస్తాము అని ఈ చిత్ర దర్శకుడు స్మైల్ శ్రీను చెప్పారు.

సంగీతం: చరణ్ అర్జున్, పాటలు: డా.వి.నాగేంద్ర ప్రసాద్ కొరియోగ్రఫీ : మురళి, పి.అర్.ఓ : కడలి రాంబాబు, ఫైట్స్: రియల్ సతీష్, స్టోరీ ప్రొడ్యూసర్: జి.రామాంజని, జి.సి.బి ప్రొడక్షన్స్, స్క్రీన్ ప్లే దర్శకత్వం: స్మైల్ శ్రీను.

ఈ చిత్రంలో అక్షిత్ శశికుమార్, కీర్తి కల్కరే కథానాయికలు.ఈ చిత్రంలో సీనియర్ డైరెక్టర్ ఎస్.నారాయణ్, సాధుకోకిల, దేవగిల్, టెన్నిస్ కృష్ణ, పవిత్రా లోకేష్ తదితరులు నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube