పాన్ ఇండియా స్టార్ అయినా ఫ్యామిలీ కథలు ఇష్టం అంటున్న ప్రభాస్

పాన్ ఇండియా సినిమాలతో ఇండియన్ స్టార్ గా మారిపోయిన నటుడు డార్లింగ్ ప్రభాస్.ప్రస్తుతం అతని రేంజ్ బాలీవుడ్ హీరోలని కూడా క్రాస్ చేసేసింది.

 Darling Prabhas Interested On Family Stories, Tollywood, Bollywood, Radheshyam M-TeluguStop.com

ప్రభాస్ తో సినిమా చేయాలంటే నిర్మాతలు కచ్చితంగా ఓ రెండు వందల కోట్లు బడ్జెట్ సిద్ధం చేసుకోవాలి.అందుకు తగ్గట్లుగానే ప్రస్తుతం ప్రభాస్ సినిమాలు కూడా తెరకేక్కుతున్నాయి.

బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమా తెలుగులో ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది.అక్కడ రికార్డు స్థాయి కలెక్షన్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో పీరియాడికల్ లవ్ స్టొరీతో తెరకెక్కిన సినిమానే దీని మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

వీటి తర్వాత ఓం రావత్ దర్శకత్వంలో ఆది పురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ సినిమాలు సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి.వచ్చే ఏడాది ఈ సినిమాల షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

ఈ సినిమాలు హిట్ అయితే ప్రభాస్ ఇమేజ్ ని ఇండియాలో ఏ హీరో కూడా అందుకోలేడు.

పాన్ ఇండియా స్టార్ గా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నా కూడా ప్రభాస్ కి భాగా ఇష్టమైన జోనర్ మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని టాక్ వినిపిస్తుంది.

అతని కెరియర్ లో హిట్ అయిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు ప్రభాస్ కి భాగా ఇష్టమైన సినిమాలని మీడియాతో చెప్పినట్లు టాక్.అవకాశం దొరికితే ఫ్యామిలీ కథలో నటించాలని ఉందని సన్నిహితుల దగ్గర చెప్పినట్లు తెలుస్తుంది.

పాన్ ఇండియా రేంజ్ లో ఫ్యామిలీ కథలని ఆవిష్కరించడం అంటే కష్టమైన విషయమే.ఇప్పుడు ప్రభాస్ ఉన్న రేంజ్ కి తనని తనని తాను తగ్గించుకుంటేనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథలు చేసే అవకాశం ఉంటుంది.

మరి అలాంటి ప్రయత్నం ఏమైనా ప్రభాస్ మళ్ళీ చేసే అవకాశం ఉందా అనే డౌట్ అతని మాటల బట్టి వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube