రాజకీయ పార్టీల పొత్తులపై సీపీఐ తెలంగాణ శాఖ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సీపీఐ పార్టీ పొత్తుల గురించి ఏ ఒక్కరికీ అనుమానాలు అవసరం లేదన్నారు.
దేశంలో పొత్తులు పెట్టుకోని పార్టీ అంటూ ఏదీ లేదని పేర్కొన్నారు.
అనంతరం బీజేపీపై కూనంనేని విమర్శలు గుప్పించారు.
కరోనా కంటే బీజేపీ ప్రమాదకరమైనదని వ్యాఖ్యనించారు.ఈ నేపథ్యంలోనే మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు.
కమ్యూనిస్టులు లేకుండా ఏ పార్టీ ముందుకు వెళ్లలేదని స్పష్టం చేశారు.