తెలంగాణ సీనియర్ నేత, ఎంపీ కే.కేశవరావు( K Keshava Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ మార్పు వ్యవహారంపై మాట్లాడిన ఆయన తన రాజకీయ జీవితంలో కాంగ్రెస్ ఎంతో చేసిందని తెలిపారు.85 ఏళ్ల జీవితంలో సుమారు 55 ఏళ్లు కాంగ్రెస్ లోనే ఉన్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ లో ఎన్నో పదవులు అనుభవించానని పేర్కొన్నారు.మంత్రిగా, ఎంపీగా, సీడబ్ల్యూసీ మెంబర్ గా అవకాశం ఇచ్చిందని తెలిపారు.తెలంగాణ కోసం ఎంపీలతో కలిసి పోరాటం చేశానన్న కేకే కాంగ్రెస్( Congress ) చాలా గొప్ప పార్టీ అని వెల్లడించారు.దేశంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు.