Allari Naresh Gamyam: గమ్యం సినిమాలో అల్లరి నరేష్ పాత్ర చేజేతుల పోగొట్టుకుంది ఎవరో తెలుసా ?

గమ్యం.( Gamyam Movie ) ఈ చిత్రానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి స్థానం ఉంది.

 Comedian Sunil Missed Chance Allari Naresh Gamyam Movie Role-TeluguStop.com

గమ్యం సినిమాలో అల్లరి నరేష్, శర్వానంద్ హీరోలుగా నటించగా కమలిని ముఖర్జీ హీరోయిన్ గా నటించింది.దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అటు అల్లరి నరేష్( Allari Naresh ) కెరీర్ కి అలాగే శర్వానంద్( Sharwanand ) కెరీర్ కి కూడా ఎంతో దోహద పడింది అని చెప్పుకోవచ్చు.

ఇలాంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ లతో సినిమాలు వచ్చి చాలా ఏళ్లు గడిచిపోయింది మళ్ళీ అలాంటి దమ్మున్న దర్శకుడు తెలుగు ఇండస్ట్రీలో లేరనే చెప్పాలి.ప్రస్తుతం క్రిష్ కూడా ఫామ్ లో లేడు.

ఇక ఏ సినిమా తీయాలనుకున్న మొదట ఒక కాస్ట్ అనుకుంటారు కానీ సినిమా తీసే సమయానికి అన్ని మారిపోతూ ఉంటాయి.

Telugu Allari Naresh, Allarinaresh, Sunil, Krish, Gali Seemu, Gamyam, Sharwanand

అలాగే గమ్యం సినిమాకి కూడా మొదట అనుకున్నా వారు సినిమా మొదలయ్యే సమయానికి లేరడే చెప్పాలి అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అల్లరి నరేష్ ఒక్క పాత్ర ఈ పాత్ర ఆ సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు.గాలి శీనుగా( Gaali Seenu ) అతను నటించిన విధానం కానీ ఎమోషన్స్ సీన్స్ లలో అలాగే చనిపోయే సన్నివేశాల్లో అల్లరి నరేష్ నటన కానీ కచ్చితంగా అతడు కెరియర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ అనుకోవచ్చు.అయితే అల్లరి నరేష్ స్థానంలో అంతకు ముందు అనుకున్న నటుడు వేరే నటుడు అని తెలుస్తుంది.

క్రిష్ ఈ పాత్ర కోసం మొదట కమీడియన్ సునీల్ అని అనుకున్నారట.

Telugu Allari Naresh, Allarinaresh, Sunil, Krish, Gali Seemu, Gamyam, Sharwanand

కానీ కమెడియన్ సునీల్( Comedian Sunil ) మాత్రం అప్పటికే రెండు సినిమాలు హీరోగా మరియు ఒక సినిమా కమీడియన్ గా ఒప్పుకొని ఉన్నారు.అందుకే క్రిష్ అడగగానే డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు.కథ మొత్తం విన్న తర్వాత సునీల్ చాలా ఎక్సైట్ అయ్యాడు కానీ ఒప్పుకోలేక పోయాడు.

దాంతో సునీల్ పాత్రలో మరొక హీరో అల్లరి నరేష్ ఫిక్స్ అయ్యాడు అప్పటికే అల్లరి నరేష్ పూర్తిస్థాయి కమీడియన్ కం హీరోగా తెలుగు ఇండస్ట్రీలో చలామణి అవుతున్నాడు.కానీ ఎందుకో ఆ పాత్రలో అల్లరి నరేష్ చక్కగా నమ్ముతాడు అని భావించిన క్రిష్ అవకాశం ఇవ్వగా అల్లరి నరేష్ సైతం దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube