న్యూ ఇయర్ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ తెలియజేశారు.విషయంలోకి వెళ్తే డిఏ 38 శాతానికి పెంచుతున్నట్లు.
కరువు భత్యాన్ని నాలుగు శాతం పెంచినట్లు ప్రకటించారు.పెంచిన భత్యాన్ని జనవరి ఫస్ట్ నుంచి వర్తింప జేయనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
సీఎం స్టాలిన్ నిర్ణయంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఇంకా పింఛన్ దారులు లబ్ధి పొందనున్నారు.
ఈ డిఎ పెంపు నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై ప్రతి ఏటా ₹2,359 అదనపు భారం పడనుంది.
డియర్ పెంపు నిర్ణయంతో ఉద్యోగాల వేతనాలు 628 రూపాయల నుంచి 11 వేల వరకు పెరగనున్నాయి.ఇక ఇదే సమయంలో పార్ట్ టైం టీచర్ లు చేస్తున్న డిమాండ్లను పరిష్కరించడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు స్టాలిన్ తెలియజేశారు.
ఈ కమిటీలో ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్, ఆర్థిక శాఖ కార్యదర్శి, పాఠశాలల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి తదితరులు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు.