ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.దళితులంటే జగన్ కు చిన్నచూపని ఆరోపించారు.
కేఎస్ జవహర్ తో పోలీసులు వ్యవహరించిన దురుసు ప్రవర్తన సరికాదన్నారు.కేఎస్ జవహర్ ను పోలీస్ స్టేషన్ లో నేలపై కూర్చోబెట్టి అవమానిస్తారా అని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో జవహర్ ను అవమానించిన పోలీసులను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలన్నారు.దళితులకు సీఎం జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.