మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ గతం లో పలు సార్లు సంక్రాంతి సీజన్ లో తలపడ్డ విషయం తెలిసిందే.ఐదు సంవత్సరాల క్రితం వీరిద్దరూ ఖైదీ నెంబర్ 150 మరియు గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలతో తలపడ్డ విషయం తెలిసిందే.
ఆ సంక్రాంతి కి ఇద్దరు కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నారు.అంతే కాకుండా రెండు సినిమా లు కూడా 100 కోట్ల కలెక్షన్స్ ని నమోదు చేసి సూపర్ డూపర్ హిట్ అన్నట్లుగా నిలిచాయి.
ఇద్దరు పెద్ద హీరోలు ఒకే సీజన్ లో వచ్చి కూడా అంతటి విజయాలు సొంతం చేసుకున్నారంటే వారి యొక్క స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.ఇక వచ్చే సంవత్సరం సంక్రాంతి కి కూడా మరో సారి మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ వారి వారి సినిమా లతో బాక్సాఫీస్ వద్ద ఫైట్ కి రెడీ అవుతున్నారు అంటూ అధికారికంగా క్లారిటీ వచ్చేసింది.
బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న మెగా 154 సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొందుతున్న వీరసింహారెడ్డి సినిమా ను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని రివల్ చేసి ప్రకటించారు.ఈ రెండు సినిమా లు కూడా సంక్రాంతి కి విడుదల కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన రావడం తో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ రెండు సినిమా లు మాత్రమే కాకుండా మరో రెండు మూడు సినిమా లు కూడా సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
వచ్చే సంక్రాంతికి రాబోతున్న ఈ రెండు సినిమాలు కూడా భారీ విజయాలను సొంతం చేసుకుంటాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది.