'కుప్పం ' భయపెడుతోందా ? రెండు చోట్లా బాబు పోటీ ? 

కుప్పం నియోజకవర్గం పేరు చెబితే గుర్తుకు వచ్చేది చంద్రబాబు.వరుసగా ఆయన అదే నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్నారు.

 Kuppam, Kuppam Constency, Chandrababu, Jagan, Bjp, Janasena,mptc,zptc, Cbn, Ap,-TeluguStop.com

ఈ బాబుకు ఈ నియోజకవర్గం తో విడదీయలేని బంధం ఉంది.అయితే ఇప్పుడు అటువంటి కంచు కోటకు బీటలు వారాయి.

ఎప్పుడూ ఎదుర్కొని ఒడిదుడుకులు ఈ నియోజకవర్గంలో ఎదుర్కొంటున్నారు.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు తోపాటు, ఎంపీటీసీ ,జడ్పిటిసి ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో మెజార్టీ  స్థానాలు వైసీపీ దక్కించుకుంది.

ఇది నిజంగా చంద్రబాబుకు ఇబ్బందికర పరిణామమే.ఎప్పుడూ ఇటువంటి దారుణమైన ఫలితాలను ఆయన చూడలేదు.

ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతోంది.

ఇంకా సగం మిగిలి ఉంది.

వరుసగా అనేక ప్రజా సంక్షేమ పథకాలను జగన్ అమల చేసుకుంటూ వస్తున్నారు.దీంతో పెద్దగా ప్రజావ్యతిరేకత కనిపించడం లేదు.2024 ఎన్నికలను టార్గెట్ చేసుకుని జగన్ ముందుకు వెళ్తున్నారు .టిడిపికి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాలను టార్గెట్ చేసుకుని అక్కడ బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు.బలమైన నాయకులను భయపెట్టో,  బుజ్జగించో తమ పార్టీ లోకి వచ్చేలా చేసుకుంటున్నారు.2019 ఎన్నికల్లో 175 స్థానాలకు గాను వైసిపి 151 స్థానాలను గెలుచుకోవడం తో , టిడిపి కేవలం 23 స్థానాలకే పరిమితం అయిపోయింది.

Telugu Chandrababu, Jagan, Janasena, Kuppam, Lokesh, Mptc, Uttarandra, Vizag, Zp

అలా గెలిచిన వారి లోనూ, నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి జై కొట్టారు.ఇంకా మరికొంతమంది జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.ఈ విధంగా ఎన్నో రకాల ఇబ్బందులను టిడిపి ఎదుర్కొంటోంది.ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి చంద్రబాబు పోటీ చేస్తే గెలుపు సాధ్యమేనా అనే సందేహాలు అప్పుడే మొదలైపోయాయి.

ముందుగా ఈ నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీకి దింపుదామని భావించినా, మళ్లీ తానే పోటీ చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.కుప్పం తో పాటు మరో నియోజకవర్గంలోనూ పోటీ చేస్తే మంచిదనే అభిప్రాయం లో ఉన్నారట.

అందుకే ఏ ప్రాంతం నుంచి పోటీ చేయాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం.ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి బలమైన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో బాబు ఉన్నట్టు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube