తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఈ ఏడాది అసలు కలిసి రాలేదు.చాలామంది ప్రముఖ నటులు మరణించడం జరిగింది.
సెప్టెంబర్ నెలలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, నవంబర్ నెలలో సూపర్ స్టార్ కృష్ణ మరణించగా ఇటీవల సీనియర్ నటుడు కైకాల ఆ తర్వాత చలపతిరావు మరణించడం జరిగింది.
కైకాల సత్యనారాయణ గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై మంచం మీదనే చికిత్స తీసుకుంటూ ఉన్నారు.
ఈ క్రమంలో 23వ తారీకు తుది శ్వాస విడిచారు.ఆ తర్వాత ఆదివారం ఉదయం సీనియర్ నటుడు చలపతిరావు గుండెపోటుతో మృతి చెందడం జరిగింది.
ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ లో కైకాల నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఆ తర్వాత సీనియర్ నటుడు చలపతిరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.చలపతిరావు కుమారుడు రవిబాబుతో కాసేపు ముచ్చటించారు.