టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా( Minister Roja ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అసెంబ్లీ టికెట్లు అమ్ముకునేది చంద్రబాబేనని( Chandrababu ) చెప్పారు.
సర్వేల ఆధారంగా వైసీపీ టికెట్లు కేటాయిస్తుందని తెలిపారు.గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులతో ముంచేశారని మంత్రి రోజా ఆరోపించారు.
ప్రస్తుతం చంద్రబాబుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని తెలిపారు.చంద్రబాబు ఎన్ని పార్టీలతో జతకట్టినా అభ్యర్థులు ఉండరన్నారు.
అదేవిధంగా కుప్పంలో ( kuppam ) చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు.చంద్రబాబు రెండో సీటు కోసం వెతుకుతున్నారన్న రోజా మంగళగిరి నుంచి లోకేశ్( Nara Lokesh ) కూడా వేరే సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.అలాగే రెండు చోట్ల ఓడినప్పుడే పవన్ కు లీడర్ షిప్ లేదని డిసైడ్ అయిందన్నారు.కానీ చంద్రబాబు పొత్తులు లేకుండా పోటీ చేయరని తెలిపారు.