బీసీల‌పై బెంగ‌.. బాబూ మ‌రీ ఇంత దారుణ‌మా..?

బీసీలే వెన్నెముక అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌క‌టిస్తారు.పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అదేంటో .ఆయ‌న బీసీల చుట్టూ ఉన్న‌ట్టే ఫీల‌వుతారు.పార్టీ అధికారంలోకి రాగానే.

 Ap Ex Cm Chandrababu Naidu Politics On Bc, Chandrababu Naidu,ycp, Bc Politics, C-TeluguStop.com

రింగురింగులు వేసుకుని త‌న సొంత కోట‌రీలోకి వెళ్లిపోతారు.త‌ర్వాత మ‌ళ్లీ స్టోరీ సేమే! ఇక్క‌డో లాజిక్ ఉంది.

చంద్ర‌బాబు ఎవ‌రినైనా త‌న అనుకుంటే.ఇక వారు ఎల్ల‌కాలం త‌న‌తోనే ఉండిపోవాల‌ని అనుకుంటున్నారు.

బీసీల విష‌యంలోనూ ఆయ‌న ఆలోచ‌న ఇలానే ఉంది.బీసీలు మూకుమ్మ‌డిగా టీడీపీకే అండ‌గా ఉండాలి త‌ప్ప‌.

వేరే పార్టీవైపు చూడ‌కూడ‌దు! అనేది బాబు కాన్సెప్ట్‌.ఈ ప‌రిణామ‌మే ఇప్పుడు చంద్ర‌బాబును అభాసుపాలు చేస్తోంది.

వైసీపీ ప్ర‌భుత్వం బీసీల‌కు 56 కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసింది.మొత్తంగా 132 కులాల‌కు సంబంధించి భారీ ఎత్తున ఈ కార్పొరేష‌న్ల ‌ను ఏర్పాటు చేయ‌డం పెద్ద సంచ‌ల‌నంగా ఆపార్టీ ప్ర‌చారం చేసుకుంటోంది.

అంతేకాదు.ఈ కార్పొరేష‌న్లకు చైర్మ‌న్లుగా నియ‌మితు లైన వారిలో 50 శాతం మంది మ‌హిళ‌లే కావ‌డం.

గ‌మ‌నార్హ‌మ‌ని, ఇలాంటి చ‌రిత్ర గ‌తంలో ఎక్క‌డా ఏప్రభుత్వంలోనూ లేద‌ని.ఆ మాట‌కొస్తే.

దేశంలోనే లేద‌ని కూడా వైసీపీ ప్ర‌చారం చేసుకుంటోంది.

సో.

క‌ళ్ల‌ముందు క‌నిపిస్తున్న `నిజానికి` ప్ర‌చారం చేసుకుంటే ఎవ‌రు మాత్రం కాదంటారు.సో. వైసీపీని త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు.మ‌రి ఇలా అయితే.

బీసీలు.వైసీపీ వైపు మొగ్గిపోవ‌డం ఖాయం క‌దా.

ఓటు బ్యాంకులో తాము వెనుక‌బ‌డి పోతాం క‌దా.అనుకున్న చంద్ర‌బాబు వెంట‌నే చ‌క్రం తిప్పారు.

బ‌టన్ నొక్కారు.అంతే.ఓ వ‌ర్గం మీడియాలో వైసీపీ స‌ర్కారుపై కార్పొరేష‌న్ల ఏర్పాటు విష‌యంలో విమ‌ర్శ‌లు దుమ్ము రేగాయి.

“ఈ కార్పొరేష‌న్లు వేస్ట్‌.బీసీల క‌ళ్ల‌కు జ‌గ‌న్ గంత‌లు క‌డుతున్నాడు.నిధుల్లేని కార్పొరేష‌న్లు ఎందుకండీ!.ఇదో పెద్ద కుట్ర‌.భారీ మోసం.

బీసీల‌కు తీవ్ర అన్యాయం.ఈ చ‌రిత్ర‌లో చోటు చేసుకోని విధంగా దెబ్బ‌కొట్టారు“-అని సోకాల్డ్ నేత‌లు కొంద‌రు విరుచుకుప‌డ్డారు.

అయితే, వీరంద‌రికీ ఒక్క‌టే ప్ర‌శ్న‌.అస‌లు కార్పొరేష‌న్ల‌ను ఏర్పాటు కానివ్వండి.

త‌ర్వాత కొన్నాళ్ల‌కు ఏమైనా లోపాలుంటే చెప్పండి!.అంతే త‌ప్ప‌.

బాబు డైరెక్ష‌న్‌లో ఎందుకు ఇలా రోడ్డున ప‌డ‌తారు? అనే.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube