బాబు చెప్తే సరే ! 'చేయి' కలపడంపై సమర్ధింపు

ఏపీలో టీడీపీ కాంగ్రెస్ పొత్తు పై సొంత పార్టీ నుంచి అధినేత చంద్రబాబుకు నిరసన వ్యక్తమవుతోంది.స్వర్గీయ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఏ ఉద్దేశంతో పార్టీని పెట్టాడు.

 Chandrababu Naidu About Tieup With Congress11-TeluguStop.com

ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు ఎలా కలిపాడు మరి ఎంత దిగజారుడు రాజకీయం అవసరమా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.అయితే ఈ దాడి పై బాబు తన మార్క్ తెలివి తేటలను చూపిస్తున్నాడు.

చంద్రబాబు ఏది చేసినా అది లోక కళ్యాణం కోసమే అన్నట్టుగా మాట్లాడుతాడు.ఆయన నంది అంటే నందే పంది అంటే పంది అని అనుకోవాలని చూస్తుంటాడు.

ఎన్నికల్లో నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేసాడు బాబు .గుజరాత్ అభివృద్ధి చెందడానికి కారణం మోదీ అని , అసలు ఆయన ప్రధాని అయితే దేశం రూపురేఖలు మారిపోతాయి అలాంటి గొప్ప నాయకుడు ఉండడం మన అదృష్టంఅంటూ.చెప్పుకొచ్చాడు.ఆ తరువాత నాలుగేళ్ల తర్వాత మోదీతో సున్నం పెట్టుకుని బయటకు వచ్చేశాడు.మోడీ అసమర్థుడని ఆయన వల్లే దేశంలో ఇలా అయిపోయిందని అంటూ దుమ్మెత్తి పోశాడు.ఇక ప్రత్యేక హోదా విషయంలోనూ అదే తంతు.

హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అంటూ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వారిని జైలుకు పంపారు.

వైసిపి అధినేత జగన్ దీనిపై పోరాటాలు దీక్షలు చేస్తుంటే ఎగతాళి చేశాడు ఆ తరువాత బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు.

ప్రత్యేక హోదా కావాలంటూ రోడ్డెక్కారు.ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీ మీద కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డాడు.

ఇప్పుడు మోదీ గ్రాఫ్ పడిపోవడం ఏపీలో గెలుపు అవకాశాలు సన్నగిల్లడం మొదలైన కారణాలతో యూటర్న్ తీసుకుని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు.టిడిపి కాంగ్రెస్ పొత్తు చారిత్రాత్మక అవసరం అని బిజెపి వైసిపి జనసేన కలిసి కుట్రలు చేస్తూ ఏపీకి అన్యాయం చేస్తున్నాయని అందుకే కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుందని చెప్పుకొచ్చారు.

రాహుల్ గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని హామీ ఇచ్చారు అంటూ ఆ పార్టీని అందుకే సమర్దిస్తున్నాను అంటూ… ఇలా రకరకాలుగా తనకు నచ్చిన విధంగా చెప్తున్నాడు.ఈ విషయంలో ఎటువంటి నిందలు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు.అయితే టిడిపి వీరాభిమానులు… పార్టీ సీనియర్లు కొంతమంది బాబు తీరుపై గుర్రుగా వున్నారు.బాబు చెప్తే మాకు ఒకే కానీ ప్రజలు ఈ విషయం గురించి నెగిటివ్ గా అనుకునే ఛాన్స్ ఉందని, అసలు మేము ప్రజల్లోకి ఈ విషయంలో ఏం చెప్పుకుని వెళ్లాలి అంటూ ఆవేదన గా చెప్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube