జగన్ పై దాడి : వైసీపీ ఎమ్యెల్యేకు నోటీసులు

వైసీపీ అధినేత జగన్ కేసులో రోజుకొకరు అన్నట్టుగా ఏదో ఒక విషయంపై నోటీసులు అందుకుంటూనే ఉన్నారు.

ఈ కేసు చిక్కుముడి విప్పేందుకు పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

తాజాగా.వైసీపీ నేత జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

జగన్ పై దాడిచేసింది టీడీపీ కార్యకర్తేనని ఇటీవల జోగి రమేష్ ఆరోపించారు.శ్రీనివాస్ టీడీపీ కార్యకర్త అనడానికి తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయంటూ అతని టీడీపీ సభ్యత్వ నమోదు కార్డును బహిర్గతం చేశారు.అయితే శ్రీనివాస్ టీడీపీ కార్యకర్త కాదని ఆ సభ్యత్వ నమోదు ఫేక్ అని టీడీపీ చెప్తుంది.

Advertisement

జోగి రమేష్ ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.టీడీపీ కార్యకర్తల మనోభవాలు దెబ్బతినేలా జోగిరమేష్ వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు జోగిరమేష్ కు నోటీసులు అందజేశారు.ఈనెల 6న విచారణకు రావాలని ఆదేశించారు.

జగన్ పై హత్యాయత్నం చేసింది టీడీపీ కార్యకర్తేనన్న వ్యాఖ్యలకు ఆధారాలు సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు.

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు