షార్ట్ ఫిలిం రాణి,ఈ మధ్యే వెండితెరపై తళుక్కుమన్న అందం చాందిని చౌదరి .చూడచక్కని ఈ తెలుగు అమ్మాయి చప్పుడు లేకుండా ఒక పెద్ద ఆఫర్ ను లాగేసుకుంది.
ఇటివలే కేటుగాడు అనే సినిమాతో పలకరించి విమర్శలు ముటగట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సూపర్ స్టార్ మహేష్ తో చిందులేసిందట … ఇదంతా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న బ్రహ్మోత్సవం కోసం.ఇటివలే రామోజీ ఫిలిం సిటిలో మొదలైన ఈ సినిమా ప్రస్తుతం పాట చిత్రీకరణలో ఉంది.
ఇదే మహేష్ పరిచయ గీతం అంటున్నారు.
ఈ గీతంలో చాందిని చౌదరి సూపర్ స్టార్ తో కలిసి డ్యాన్స్ చేసిందట.
ఈ విషయాన్ని బయటకి వెళ్ళకుండా దాచినప్పటికి విషయం ఎంతోకాలం నిలవదుగా .అయితే కేవలం పాట వరకే చాందిని పరిమితమ లేక ఏదైనా పాత్ర కూడా చేస్తోందా అనేది ఇంకా తెలియరాలేదు.
పీ.వి.పీ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్, సమంత, ప్రణీత కథనాయకలు.మిక్కి.
జే.మేయర్ సంగీతం అందిస్తున్నారు.వచ్చే వేసవి సెలవుల్లో ఈ చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.