ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులకు 27 మంది ఎన్ఆర్ఐలు ఎంపిక... వివరాలివే..!!

ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్ (పీబీఎస్ఏ) కోసం 27 మంది ఎన్ఆర్ఐలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్‌లో భాగంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డ్‌లను ప్రదానం చేస్తారు.

 Center Names 27 Overseas Indians For Pravasi Bharatiya Samman Awards , Pravasi B-TeluguStop.com

భారత సంతతి (పీఐవోలు), ఎన్ఆర్ఐలు సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ అవార్డ్‌లను బహూకరిస్తారు.ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ 17వ ఎడిషన్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జనవరి 8 నుంచి 10 వరకు జరగనుంది.

ప్రవాసీ భారతీయ దివాస్ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ఈ అవార్డ్‌లను ప్రదానం చేస్తారు.ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్‌ల నామినేషన్లను పరిశీలించి, అవార్డ్ గ్రహీతలను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

అవార్డ్‌కు ఎంపికైన వారిలో ఆస్ట్రేలియాకు చెందిన జగదీష్ చెన్నుపాటి, భూటాన్‌కు చెందిన సంజీవ్ మెహతా, బ్రెజిల్‌కు చెందిన దిలీప్ లౌండో, బ్రూనైకి చెందిన అలెగ్జాండర్ మలియాకెల్ జాన్ మెడిసిన్, కెనడాకు చెందిన వైకుంఠం అయ్యర్ లక్ష్మణన్, కమ్యూనిటీ వెల్ఫేర్‌లో కెనడాకు చెందిన జోగిందర్ సింగ్.కళ, సంస్కృతిలో క్రొయేషియాకు చెందిన నిజ్జర్, ఐటీలో డెన్మార్క్‌కు చెందిన రామ్‌జీ ప్రసాద్.సామాజిక సేవలో ఇథియోపియాకు చెందిన కన్నన్ అంబలమ్ వున్నారు.

కమ్యూనిటీ వెల్ఫేర్‌లో జర్మనీకి చెందిన అమల్ కుమార్ ముఖోపాధ్యాయ.

రాజకీయాలు , సమాజ సంక్షేమంలో గయానాకు చెందిన మొహ్మద్ ఇర్ఫాన్ అలీ, రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు చెందిన పర్మానంద్ సుఖుమల్ దాస్వానీ, మోహన్‌లాల్ హీరా, దక్షిణ సుడాన్‌కు చెందిన సంజయ్ కుమార్ శివభాయ్ పటేల్.వ్యాపార రంగంలో ఇజ్రాయెల్‌కు చెందిన రీనా వినోద్ పుష్కర్ణ, పోలాండ్‌కు చెందిన కైలాష్ చంద్ర, సింగపూర్‌కు చెందిన పీయూష్ గుప్తా .విద్యా రంగంలో జపాన్‌కు చెందిన మక్సూదా సర్ఫీ షియోటానీ, మెక్సికోకు చెందిన రాజగోపాల్‌ వున్నారు.

Telugu Bhutan, Brazil, Namesindians, Iyer Laxmanan, Joginder Singh, Sanjeev Meht

వీరితో పాటు శ్రీలంకకు చెందిన శివకుమార్ నడేసన్ (కమ్యూనిటీ వెల్ఫేర్), సురినామ్‌కు చెందిన దేవన్‌చంద్రభోస్ శర్మన్ (కమ్యూనిటీ వెల్ఫేర్), స్విట్జర్లాండ్‌కు చెందిన అర్చన శర్మ (సైన్స్ అండ్ టెక్నాలజీ), ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన ఫ్రాంక్ ఆర్థర్ సీపర్‌సాద్ (కమ్యూనిటీ వెల్ఫేర్), యూఏఈకి చెందిన సిద్ధార్థ్ బాలచంద్రన్ (వ్యాపారం), యూకేకు చెందిన చంద్రకాంత్ బాబూభాయ్ పటేల్ (మీడియా), యూఎస్‌కి చెందిన దర్శన్ సింగ్ ధలీవాల్ (వ్యాపారం మరియు సమాజ సంక్షేమం), యూఎస్‌కి చెందిన రాజేష్ సుబ్రమణ్యం (వ్యాపారం), ఉజ్బెకిస్థాన్‌కి చెందిన అశోక్ కుమార్ తివారీ (బిజినెస్) కూడా అవార్డు గ్రహీతలలో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube