విజయవాడలో కారు బీభత్సం సృష్టించింది.స్థానిక బీఆర్టీఎస్ రోడ్డులోని కేంద్ర విద్యాలయం నంబర్ వన్ స్కూల్ వద్ద బారికేడ్లపై నుంచి కారు దూసుకెళ్లింది.
స్కూల్ విద్యార్థులపైకి కారు రావడంతో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి.వెంటనే గమనించిన స్థానికులు బాధిత విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.
అయితే విద్యార్థులకు ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.