Varun Tej : పెద్దనాన్న బాటలోనే వరుణ్ తేజ్ సినిమా.. ప్చ్.. మెగా ఫ్యామిలీకి ఫ్లాఫ్‌లు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కించిన భోళాశంకర్ సినిమా( Bhola Shankar ) ఆగస్టు 11న విడుదలైన విషయం తెలిసిందే.కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

 Varun Tej Again Hit With Flop-TeluguStop.com

సినిమా బాగాలేదని మెగాస్టార్ అభిమానులే థియేటర్ల దగ్గర రివ్యూ తీసుకోవడానికి వచ్చిన యూట్యూబ్ ఛానెళ్లకు చెప్పడం విశేషం.మెహర్ రమేష్ సినిమాను చెడగొట్టాడని మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.

మెహర్ రమేష్‌కు చిరంజీవి మంచి అవకాశం ఇస్తే.చివరికి ఫ్లాఫ్ మూవీ అందించాడంటూ మండిపడుతున్నారు.

Telugu Allu Arjun, Bhola Shankar, Chiranjeevi, Pawan Kalyan, Tamannaah, Varun Te

భోళాశంకర్ సినిమాకు కలెక్షన్లు కూడా అంతగా రాలేదు.వారం రోజుల తర్వాత అన్ని థియేటర్లలోనూ సినిమాను ఎత్తేశారు.అయితే భోళాశంకర్ మూవీ పరాజయాన్ని అందుకున్న కొద్దిరోజులకే మెగా ఫ్యామిలీ మరో ఫ్లాఫ్ అందుకుందనే టాక్ సినీ వర్గాల్లో వినిస్తోంది.అదే వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గాండీవధారి అర్జున్ మూవీ.

( Ghandeevadari Arjuna ) ఈ సినిమాకు కూడా ప్రేక్షకుల నుంచి స్పందన రావడం లేదు.

కథ, కథనం, పాటలు, బీజీఎం, హీరోయిన్ ఫర్‌ఫామ్మెన్స్, ప్రమోషన్స్ వ్యవహారాలు.

హైప్ క్రియేట్ చేయకపోవడం వంటివి ఈ సినిమాకు మైనస్ గా మారాయి.కథ కొత్తగా లేకపోవడం, రోటీన్ పాత్రలు, ట్విస్ట్ లు ఈ సినిమాకు నెగిటివ్ గా చెప్పుకోవచ్చు.

ఏదో సినిమా తీయాలని అని భావించి సినిమా తీసినట్లు అనిపించింది.ఇలాంటి కథను వరుణ్ తేజ్( Varun tej ) ఎలా ఒప్పుకున్నాడో కూడా అర్థం కావడం లేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

కెరీర్ స్టార్టింగ్ లో వరుణ్ తేజ్ విభిన్నమైన కథలను ఎంచుకుని మంచి పేరు తెచ్చుకున్నాడు.

Telugu Allu Arjun, Bhola Shankar, Chiranjeevi, Pawan Kalyan, Tamannaah, Varun Te

గని సినిమా ఫెయిల్యూర్ తర్వాత వరుణ్ తేజ్ సినిమా కథల విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేదని సినీ వర్గాలు చెబుతున్నాయి.వరుణ్ తేజ్‌కు సరైన గైడెన్స్ లేనట్లు ఉందని అంటున్నారు.అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ( Jr ntr )రెబల్ స్టార్ ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలకు స్టార్ డమ్ ఎక్కువగా ఉంటుంది.

దీంతో వాళ్ల సినిమాలు ఎలా ఉన్నా చూడటానికి ప్రేక్షకులు క్యూ కడతారు.కానీ వరుణ్ తేజ్ సినిమాలు అలా కాదు.సినిమా బాగుంటేనే ప్రేక్షకులు వచ్చి చూస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube