యూఎస్‌లో ఎన్నారైలను లక్ష్యంగా చేసుకున్న నగల దొంగలు.. పోలీసుల సూచనలు ఇవే..

అమెరికాలో నివసిస్తున్న అనేక భారతీయ కుటుంబాలను( Indian Families ) ప్రత్యేకంగా టార్గెట్ చేసిన దొంగల ముఠా గురించి అక్కడి పోలీసులు తాజాగా మాట్లాడారు.ఎన్నారైల( NRI ) నగలను ఈ దొంగల ముఠా దోచుకెళ్లిందని వెల్లడించారు.

 Burglaries Targeting Indians Jewelry In Usa Details, Indian Families, Nri Famili-TeluguStop.com

దక్షిణ అమెరికా( South America ) నుంచి వచ్చే ఈ దొంగలు దేశంలోకి ప్రవేశించడానికి ఫేక్ పాస్‌పోర్ట్‌లను ఉపయోగిస్తున్నారని తెలిపారు.వారు చిన్న బృందాలుగా ఏర్పడి యజమానులు బయటికి వెళ్లినప్పుడు ఇళ్లలోకి చొరబడతారని వివరించారు.

భారతీయ కుటుంబాలు వారసత్వంగా ఉంచుకునే బంగారం, ఇతర విలువైన లోహాలను కొట్టేసేందుకు ఈ కేటుగాళ్లు ప్రయత్నిస్తారని తెలిపారు.తుపాకులు, కంప్యూటర్లు లేదా కార్లు వంటి ఇతర వస్తువులను వారు అస్సలు ముట్టుకోరని కూడా వెల్లడించారు.

సౌత్ అమెరికన్ థెఫ్ట్ గ్రూప్స్(SATG) అనే పెద్ద నెట్‌వర్క్‌లో భాగమైన ఈ దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు.ఇకపోతే ఈ దొంగలు( Burglars ) తమ బాధితులను నిశితంగా గమనిస్తున్నారని, కొన్నిసార్లు వారి ప్రయాణ ప్రణాళికలను ట్రాక్ చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తారని పోలీసులు కనుగొన్నారు.

వారు తక్కువ సురక్షితమైన రెండవ అంతస్తు కిటికీల ద్వారా ఇళ్లలోకి ప్రవేశించడానికి ఇష్టపడతారని, వారు సాధారణంగా మధ్యాహ్నం, 10 గంటల మధ్య చోరీ చేస్తారని తెలియజేశారు.

Telugu Burglars, Security, Indian, Indians Jewelry, Jewelry, Nri, Satg, America,

ఈ ముప్పు గురించి వారిని హెచ్చరించడానికి, తమను తాము రక్షించుకోవడానికి కొన్ని చిట్కాలను అందించడానికి పోలీసులు భారతీయ సమాజంతో సమావేశాలు నిర్వహించారు.అలారాలు, కెమెరాలు, లాక్‌లను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా ఇంటి భద్రతను( Home Security ) ఇంప్రూవ్ చేసుకోవాలని సూచించారు.విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు డిపాజిట్ బాక్స్‌లో భద్రపరుచుకోవాలని సలహా ఇచ్చారు.

బయటికి వెళ్తున్నప్పుడు లేదా ఏదైనా ట్రావెల్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ వివరాలను సోషల్ మీడియాలో బహిరంగంగా పోస్ట్ చేయకూడదన్నారు.

Telugu Burglars, Security, Indian, Indians Jewelry, Jewelry, Nri, Satg, America,

లొకేషన్ వివరాలు( Location ) సైతం దాచాలని సూచించారు.ఈ జాగ్రత్తలు పాటించి పోలీసులకు సహకరించడం ద్వారా నగలను, వారసత్వ సంపదను దొంగలు దోచుకోకుండా అడ్డుకోవచ్చు.ఈ దొంగలను గుర్తించి పట్టుకునేందుకు సహకరించాలని పోలీసులు ప్రజలను కోరారు.

న్యూజెర్సీలోని గుజరాతీ నగల దుకాణంలో జరిగిన దోపిడీకి సంబంధించిన కొన్ని సీసీటీవీ ఫుటేజీలను వారు విడుదల చేశారు.ఈ నేరం లేదా ఇలాంటి సంఘటనల గురించి ఎవరికైనా సమాచారం ఉంటే పోలీసులను సంప్రదించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube